BIKKI NEWS : అల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్దం ప్రతి సంవత్సరం 6 విభిన్న రంగాలలో ప్రపంచంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వ్యక్తులు/సంస్థలకు నోబెల్ బహుమతుల ప్రదానం (NOBEL 2022 WINNERS LIST)జరుగుతుంది.
భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, అర్ధ శాస్త్రం, శాంతి, సాహిత్య రంగాలలో ఈ బహుమతులు ప్రదానం చేస్తారు.
2022 సంవత్సరానికి గానూ మొత్తం ఆరు రంగాలలో కలిపి 12 మంది వ్యక్తులకు, 2 సంస్థలకు బహుమతులు అందజేశారు. వీరిలో ఇద్దరూ మహిళలు (సాహిత్యం, రసాయన శాస్త్రం) లలో ఉన్నారు.
పోటీ పరీక్షల నేపథ్యంలో సంక్షిప్తంగా నోబెల్ వివరాలు అందజేయడం జరిగింది. సంబంధించిన రంగాల మీద క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలు చదవండి.
◆ NOBEL 2022 WINNERS LIST
రంగం | విజేతలు | కృషి |
వైద్యశాస్త్రం | స్వాంటే పాబో | మానవ పరిణామంలో జన్యువుల మార్పిడి |
రసాయన శాస్త్రం | 1)కరోలిన్ బెర్టోజి 2)మార్టిన్ మెల్డాల్ 3)బారీ షార్ప్‌లెస్ | క్లిక్ కెమిస్ట్రీ మరియు బయో ఆర్దోగోనల్ కెమిస్ట్రీ లో కృషి |
భౌతిక శాస్త్రం | 1)అలెన్ అస్పెక్ట్ 2)జాన్ క్లాజర్ 3)అన్లాన్ జిలింగర్ | క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ & ఫోటాన్స్ పై పరిశోధనకు |
అర్ద శాస్త్రం | 1)బెన్ బెర్నాంకే 2)డగ్లస్ డైమండ్ 3)ఫిలిప్ డైబ్విగ్ | బ్యాంకులు మరియు ఆర్థిక సంక్షోభాలపై పరిశోధన |
శాంతి | 1)అలెస్ బైలియాత్సికి 2)సెంటర్ ఫర్ లిబర్టీస్ సంస్థ 3)మెమోరియల్ సంస్థ | మానవహక్కులకోసం చేసిన కృషి కి |
సాహిత్యం | అన్నె ఎర్నాక్స్ |