చరిత్రలో ఈరోజు జూలై 09

దినోత్సవం :

  • అర్జెంటీనా – జాతీయదినోత్సవం

సంఘటనలు

1875 – బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్థాపించబడింది.
1969 – భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.
1949 – అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్బవం

జననాలు

1866: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928)
1876: టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత.
1918: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007)
1920: తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్టు పార్టీ నేత. (మ.)
1925: గురుదత్, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1964)
1926: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018)
1927: గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2010)
1938: కూరెళ్ల విఠలాచార్య,తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు.
1938: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985)
1958: బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు.
1966: ఉన్నికృష్ణన్, శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు.
1969: వెంకటపతి రాజు, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1970: అనురాధ శ్రీరామ్, గాయని.

మరణాలు

2005 – భారత రాజకీయవేత్త మరియు ఇస్లామిక్ మతాధికారి రఫీక్ జకారియా 86 ఏళ్ళ వయసులో మరణించారు