చరిత్రలో ఈరోజు జూలై – 07

◆ దినోత్సవం :

  • ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

◆ సంఘటనలు

1890: అమెరికాలో మొట్టమొదటిసారిగా ఎలెక్ట్రిక్ కుర్చీని వాడారు.
1929: వాటికన్ సిటీ ని, క్రైస్తవ మతాధిపతి (పోప్) కోసం ఏర్పాటు చేసారు.
1939: గాంధేయవాది ఎ. వైద్యనాథా అయ్యర్ హరిజనులకి మదురై మీనాక్షి గుడిలో ప్రవేశం ఇప్పించారు.
1941: అమెరికన్ సైన్యం ఐస్ లాండ్ వచ్చింది.
1985: బోరిస్ బెకర్ అతి చిన్నవయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిస్) లో గెలిచాడు.
1985: రాబర్ట్ ముగాబే కొత్తగా ఏర్వడిన జింబాబ్వే అధ్యక్షుడు అయ్యాడు.
1896: భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించారు.
2005: లండనులో వరుస బాంబు పేలుళ్ళు 30మంది మరణం, 700మంది గాయాలపాలు.

◆ జననాలు

1900: కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (మ.1959)
1901: విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (మ.1974)
1908: కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ. 1970)
1915: యూల్ బ్రిన్నర్, అమెరికన్ సినీ నటుడు.
1916: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత. (మ.2009)
1920: మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (మ.1995)
1922: పియరీ కార్డిన్, ఫ్రెంచి ఫేషన్ డిజైనర్.
1942: పి.వేణుగోపాల్, హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు.
1947: జ్ఞానేంద్ర, నేపాల్ రాజు.
1956: చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
1962: ఇందిర భైరి, గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని (మ. 2023)
1981: మహేంద్రసింగ్ ధోని, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

◆ మరణాలు

1816: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (జ. 1751)
2008: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (జ.1963)
2022: పులపర్తి నారాయణ మూర్తి, రాజకీయ నాయకుడు.మాజీ ఎమ్మెల్యే. (జ.1954)
2022: గోరంట్ల రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నిర్మాత.