మానవ హక్కులకై పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి

స్టాక్‌హోం (అక్టోబర్ – 07) : నోబెల్ శాంతి బహుమతి 2022 మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్ లతో పాటు బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్సికి లకు సంయుక్తంగా లభించింది.

రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ లిబర్టీస్, బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్సీల పేర్లను నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

నోబెల్ శాంతి పురస్కారం లభించిన వారు తమ స్వదేశాల్లో ప్రజల కోసం పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అధికార దుర్వినియోగాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ.. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు తెలిపింది. ‘యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపారు. శాంతి, ప్రజాస్వామ్యం కోసం ఎంతో కృషి చేశారు.’ అని పేర్కొంది కమిటీ.

Follow Us @