Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఆగస్ట్ 04

చరిత్రలో ఈరోజు ఆగస్ట్ 04

◆ దినోత్సవం

  • తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)

◆ సంఘటనలు

0070: రోమన్లు, జెరూసలేం లోని రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేసారు.
0181: ఆకాశంలోని, కేసియోపియా రాశిలో సూపర్ నోవాని చూసారు. సూపర్ నోవా అంటే ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ, ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ, పేలిపోయే నక్షత్రం) సూపర్ నోవా
1693: డోమ్ పెరిగ్నాన్, షాంపేన్ అనే సారాయిని కనిపెట్టాడు. పాశ్చాత్య దేశాలలోని ఆడవాళ్ళు ఈ షాంపేన్ని ఎక్కువగా తాగుతారు.
1735 : బ్రిటన్ యొక్క ఉత్తర అమెరికా కాలనీలలో పత్రికా స్వాతంత్ర్యం కోసం మొదటి ముఖ్యమైన విజయం జరిగింది.జాన్ పీటర్ జెంజెర్, 1733 లో న్యూయార్క్ వీక్లీ జర్నల్ ప్రచురించడం మొదలుపెట్టాడు. వలస ప్రభుత్వ విధానాలను, తన పత్రికలో విమర్శించటంతో, వలస ప్రభుత్వం అతనిని నిర్బంధించింది. న్యాయస్థానం, అతని పత్రికలో రాసిన వాటికి, ఆధారాలు ఉన్నాయని, అతనిని విడుదల చేసింది. ఇది మొదటి పరువు ఖైదు (డిఫమేషన్) కేసు కూడా.
1777: రిటైర్ అయిన, బ్రిటీష్ సైనిక దళం అధికారి ఫిలిప్ ఆష్లే, మొదటి సర్కస్ని ప్రారంభింఛాడు.
1821: అత్కిన్సన్, అలెగ్జాండర్ అనే ఇద్దరు కలిసి, “సాటర్‌డే ఈవెనింగ్ పోస్ట్” అనే ఒక వారపత్రికను మొట్టమొదటిసారిగా ప్రచురించారు.
1824: కోస్ యుద్దం, టర్కీ దేశం, గ్రీసు దేశం మధ్య జరిగింది.
1830: చికాగో నగరం కోసం ప్రణాళికలు సిద్ధం చేసారు.
1854: హినొమరు, జపాన్ నౌకల నుండి ఎగుర అధికారిక జెండాగా ప్రకటించారు.
1858: మొదటిట్రాన్స్-అట్లాంటిక్ కేబుల్ పూర్తి అయింది.
1884: థామస్ స్టీవెన్స్ సైకిల్ మీద అమెరికా అంతా చుట్టివచ్చిన మొదటి మనిషి. ఆ తరువాత, అతడు, సైకిల్ మీద ప్రపంచమంతా, చుట్టివచ్చాడు.
1906: ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో, సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభమైంది.
1914: మొదటి ప్రపంచ యుద్ధం : బెల్జియం దేశం మీద జర్మనీ దురాక్రమణ చేసింది. బదులుగా, బ్రిటన్, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.
1916: అమెరికా డెన్మార్క్ నుండి వర్జిన్ ద్వీపాలను 25 మిలియన్ల డాలర్లకు, కొనుగోలు చేయడానికి అంగీకరించింది.
1916: మొదటి ప్రపంచ యుద్ధం : లైబీరియా దేశం, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.
1925: అమెరికా నావికాబలగాలు 13-సంవత్సరాల ఆక్రమణ తరువాత నికారాగువా దేశాన్ని (నికరాగ్వా వదిలేసి, వెళ్ళిపోయారు.
1927: అమెరికా, కెనడా ల మధ్య పీస్ బ్రిడ్జ్ (వంతెన) ప్రారంభమైంది.
1929: జిడ్డు కృష్ణమూర్తి, దివ్యజ్ఞాన సమాజం, దాని అనుబంధ సంస్థల నుంచి రాజీనామా చేసాడు.
1944: ఆమ్‌స్టర్ డాంలో దాగి ఉన్న అన్నే ఫ్రాంక్ అనే 15 సంవత్సరాల బాలికను, ఆమె కుటుంబాన్ని, నాజీలు ఖైదు చేసారు. ఈ బాలిక రాసిన అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతనకు ప్రతిబింబం ఈ డైరీ (దినచర్య పుస్తకం) .
1947: జపాన్ సుప్రీం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) ఏర్పడింది.
1954: హఫీజ్ జలంధ్రీ రాసిన, అహ్మద్ జి. ఛగియ కంపోజ్ (కూర్చిన) చేసిన, ఖయుమి తరానా జాతీయగీతాన్ని, పాకిస్థాన్, “ప్రభుత్వ జాతీయ గీతం”గా ఆమోదించింది. విను
1956: మొదటిసారిగా గంటకి 200 మైళ్ళవేగంతో మోటార్ సైకిల్ ప్రయాణించింది.
1960: అమెరికాకు చెందిన వైమానికదళ పరిశోధక విమానం, గంటకి 2, 150 మైళ్ళ వేగంతో ప్రయాణించి, రికార్డు నమోదు చేసింది. ఇది సంప్రదాయకమైన ప్రొపెల్లర్ తో కాకుండా, రాకెట్ ప్రొపెల్లర్ ఉపయోగించి, ఇంత వేగాన్ని సాధించింది.
1971: అమెరికా మనుషులు ఉన్న అంతరిక్షనౌకనుంచి, మొదటి సారిగా ఒక ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది.
1977: అమెరికా ప్రెసిడెంట్ కార్టర్ డిపార్ట్ర్త్‌మెంట్ ఆఫ్ ఎనెర్జీని ఏర్పాటు చేస్తూ సంతకం చేసాడు.
1983: ఇటలీ 1946 తరువాత, మొదటి సామ్యవాద ప్రధాన మంత్రిని ఎన్నుకుంది.
1972: అలబామా గవర్నర్ అయిన జార్జి వాలెస్ని హత్య చేయబోయిన ఆర్థర్ బ్రెమెర్ (21 సంవత్సరాలు) కి అమెరికా లోని మేరీలేండ్ న్యాయస్థానం, 63 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ హత్యాప్రయత్నంలో, జార్జి వాలెస్]కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు (న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది) . ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే సమయానికి నిందితుడి వయస్సు 74 సంవత్సరాలు ఉంటుంది.
2009: క్రమం తప్పకుండా యూరోపియన్లు 50% కంటే ఎక్కువ మంది, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో విహరిస్తారని, (గత ఐదు సంవత్సరాలలో 33% పెరిగింది) యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది.
2009: తొలి స్వైన్ ఫ్లూ మరణం, మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది.

◆ జననాలు

1719: జోహన్ గాట్లోబ్ లెమాన్, జర్మన్ ఖనిజ శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త (మ.1767)
1755: నికోలస్ జాక్వె కోంటె, “పెన్సిల్”ని కనిపెట్టిన శాస్త్రవేత్ (మ.1805).
1792: పెర్సీ షెల్లీ, ఆంగ్ల కవి (మ.1822)
1868: మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(మ.1922)
1900: క్వీన్ ఎలిజబెత్, బ్రిటిష్ రాణి తల్లి. 2000 సంవత్సరంలో బ్రిటిష్ రాణి తల్లి 100వ పుట్టినరోజు వేడుకలు బ్రిటన్ లో జరుపుకున్నారు (మ.2002).
1912: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, “కరుణశ్రీ” అని ప్రసిద్దులైనారు. (మ.1992)
1926: మండలి వెంకట కృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (మ.1997).
1948: శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
1954: ఉండవల్లి అరుణ కుమార్, భారత పార్లమెంటు సభ్యుడు.
1955: ఛార్లెస్ డి “సామ్” గెమర్ యాంక్టన్ ఎస్.డి, రోదసీ యాత్రికుడు ( రోదసీ నౌకలు ఎస్.టి.ఎస్. 38, 48)
1961: అమెరికా 44వ అధ్యక్షుడు () బరాక్ ఒబామా, హవాయి ద్వీపం లో పుట్టాడు.

◆ మరణాలు

2006: నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (జ.1931)
2007: పాగల్ అదిలాబాదీ, తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (జ. 1941)
2020: వంగపండు ప్రసాదరావు, విప్లవకవి, జానపద వాగ్గేయకారుడు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు (జ. 1943)
2020: సున్నం రాజయ్య, సిపిఎం నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోను, తెలంగాణ శాసనసభ లోనూ సభ్యుడు. (జ. 1960)
2020: ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) మాజీ డైరెక్టర్ (జ.1925)