Home > TELANGANA > Conjunctivitis – కండ్ల కలక లక్షణాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Conjunctivitis – కండ్ల కలక లక్షణాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హైదరాబాద్ (ఆగస్టు – 03) : తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తున్న కండ్ల కలక (Conjunctivitis) లక్షణాలు తీసుకోవలసిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. ఎలాంటి ఆందోళన చెందవద్దని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చని సూచించింది.

◆ కండ్ల కలక లక్షణాలు

  • కళ్ళల్లో మంట దురద నొప్పి
  • కళ్ళ నుండి తరచుగా నీరు కారడం
  • కళ్ల వాపు
  • నిద్ర లేచిన తర్వాత కనురెప్పలు అతుక్కుపోవడం
  • కళ్ళు ఎర్రగా మారడం

◆ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కండ్ల కలక వచ్చిన వారికి దూరంగా ఉండాలి

వాళ్లు వాడిన దుస్తులు, బెడ్ షీట్స్‌, దిండ్లు ఇతరులు వాడకూడదు

తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి

కళ్లద్దాలు పెట్టుకోవాలి

లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి