చరిత్రలో ఈరోజు ఆగస్టు 02

◆ సంఘటనలు

0216 బి.సి.: రెండో పునిక్ యుద్ధం: ‘కేన్నే దగ్గర జరిగిన యుద్ధం’ అంటారు – రోమన్ సైన్యం ఓడిపోయింది.
0338 బి.సి.: మసడోనియన్ సైన్యం, ఫిలిప్ II నేతృత్వంలో ఖరొనియా యుద్ధంలో, ఎథెన్స్ దళాలను, తేబెస్ దళాలను కలిపి ఓడించాడు. ఈ యుద్ధం వలన, మసడోనియన్ రాజ్యపు పెత్తనం (అధికారం) సురక్షితమైంది.
1375: మొదటి రోలర్ స్కేటింగ్ రింక్ లండన్ లో మొదలు పెట్టారు. (రెండు కాళ్ళకు చక్రాలున్న జోళ్ళు కట్టుకుని, తిరగటాన్ని రోలర్ స్కేటింగ్ అంటారు) . ప్రత్యేకంగా తయారైన వలయంలో ఈ రోలర్ స్కేటింగ్ ని నేర్చుకోవటం, పోటీలు వగైరా జరుగుతాయి.
1769: ఈ రోజు ’లాస్ ఏంజిల్స్‘ నగరానికి బారసాల జరిగిన రోజు. ఇదే రోజున ఈ నగరానికి లాస్ ఏంజిల్స్ అని పేరు పెట్టారు. గాస్పర్ ’డి’ పోర్టోల, ఒక స్పానిష్ సైనిక కెప్టెన్,, ఫ్రాన్సిస్కాన్ పూజారి అయిన జువాన్ క్రెస్పి, లు ఇద్దరినీ, శాన్ డీగో ( డియాగొ) నుండి ఉత్తరం వైపు వెళ్ళకుండగా అడ్డుకున్నారు. కానీ, వారిద్దరికీ, ఆ ప్రాంతం చాలా బాగా నచ్చింది. అందుకని దానికొక పేరు పెట్టారు ‘ఇది పొగమంచు లేని స్వర్గం’ అనే అర్ధం వచ్చేలా స్పానిష్ భాషలో . ఆ పేరు ‘ న్యూస్ట్రా సెనొరా ల రీనా డి లాస్ ఏంజెలెస్ డి పోర్సిఉన్సుల’ . ఆ పదాలకి అర్ధం దేవతల మహారాణి పోర్సిఉన్సిల, మా దేవత. పోర్సిఉన్సిలకి ఇటలీలో ఒక ఒక చిన్న గుడి ఉంది.
1776: హెన్రీ హడ్సన్ పసిఫిక్ మహాసముద్రం లోని హడ్సన్ బేని కనుగొన్నాడు. హడ్సన్ పేరుతో, ఆ ప్రాంతాన్ని హడ్సన్ బేగా పేరు పెట్టారు..
1776: కాంటినెంటల్ కాంగ్రెస్ కి హాజరు కావటానికి వచ్చిన ప్రతినిధులు అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటన పై సంతకాలు చేయటం మొదలు పెట్టారు.
1790: మొదటి సారిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జనాభా లెక్కలు మొదలు పెట్టారు.
1823: ‘ది న్యూయార్క్ మిర్రర్ , లేడీస్ లిటరరీ గెజెట్] స్థాపించబడింది. తరువాత కాలంలో ఈ వార పత్రిక, న్యూయార్క్ మిర్రర్ దినపత్రిక గా మారింది
1824: ఫిప్త్ ఎవెన్యూ న్యూయార్క్ నగరంలో ఆరంభించారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రోడ్లలో ఒకటి, అనేక అందమైన దుకాణాలు, ఫ్యాషన్ దుకాణాలకు నెలవు అయ్యింది.
1870: ప్రపంచంలో మొదటి భూగర్భ ట్యూబ్ రైల్వే, టవర్ సబ్‍వే, లండన్ లో ప్రారంభించారు..
1887: బెలాయిట్ నగరానికి (విస్కాన్సిన్ రాష్ట్రం, అమెరికా) చెందిన చెస్టర్ ఎ. హాడ్జ్ కి ముళ్ళ తీగ (ముళ్ళకంచె పేటెంట్ హక్కులు ఇచ్చారు. ఈ ముళ్ళ కంచెనే మనం ఇప్పుడు, స్థలాలకు, రక్షణకు కంచెగా, హద్దులుగా వాడుతున్నాము.
1903: ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం అయ్యింది.
1914: షెర్లాక్ హోమ్స్ సాహస గాధ “హిజ్ లాస్ట్ బౌ” నవల విడుదలైంది.
1916: మొదటి ప్రపంచ యుద్ధం: ఆస్ట్రియన్ విద్రోహ చర్యవలన ఇటాలియన్ యుద్ధనౌక లియోనార్డో డా విన్సీ టరంటొలో మునిగి పోయింది.
1931: సైన్యానికి సంబంధించిన ఏ పనినైనా, తిరస్కరించమని, ఐన్‌స్టీన్, విజ్ఞానవేత్తలను కోరాడు.
1937: మారిజునా, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులను నిషేధిస్తూ, అమెరికా, 1937 లో ’ది మారిహున టాక్స్ చట్టము’ చేసింది. (మారిజునా – ప్రమాదకరమైన మత్తు పదార్ధము) .
1939: మన్‌హట్టన్ ప్రాజెక్టు (అణుబాంబుని తయారు చేసే కార్యక్రమం) ని మొదలు పెట్టమని, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్,, లి జిల్డ్ (Le Szilrd) ఇద్దరూ, నాటి అమెరికన్ అధ్యక్షుడికి లేఖ ద్వారా విన్నవించుకున్నారు.
1943: ఈ రోజు లెఫ్టినెంట్ (జె.జి – జూనియర్ గ్రేడ్) జాన్ ఎఫ్ కెన్నెడీ (తరువాత అమెరికన్ అధ్యక్షుడు) ki ఒక చెడ్డ రోజు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అమెరికాకి చెందిన పి.టి. 109 (పెట్రోల్ టార్పెడో బోట్) జాన్ ఎప్ కెన్నెడి నడుపుతున్న సమయంలో, ’అమగిరి లేదా అమిగిరి’ పేరుగల జపాన్ వారి డిస్ట్రాయర్ యుద్ధనౌక ఆ పి.టి. 109ని ముంచివేసింది. ఆ సమయంలో, కెన్నెడీ, తన బోట్ లోని సిబ్బందిని అందరినీ (ఇద్దరిని తప్ప) రక్షించి, యుద్ధ హీరో అయ్యాడు. ఆ సంఘటన, జాన్ కెన్నెడీకి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని ఇచ్చి, అమెరికా అధ్యక్షపదవిని కట్టబెట్టింది. ఆ సమయంలో, వెన్నుపూసకు తగిలిన గాయం కూడా అలాగే జీవితాంతం వెంటాడింది. పి.టి 109 యొక్కకథ జాన్ ఎప్ కెన్నెడీగా క్లిఫ్ రాబర్ట్సన్ నటించిన, 1963సంవత్సరంలో తీసిన చిత్రం, పి.టి. 109లో హాలీవుడ్ శైలిలో చెప్పారు.
1943: ట్రెబ్లింకా లోని నాజీ మరణం శిబిరంలో తిరుగుబాటు జరిగింది.
1945: రెండవ ప్రపంచ యుద్ధం: మిత్ర రాజ్యాలు ఓడిపోయిన జర్మనీ యొక్క భవిష్యత్తు చర్చించడానికి, పోట్స్ డామ్ సమావేశం జరిపి, ఒక నిర్ణయం తీసుకున్నారు.
1967: రెండవ బ్లాక్‌వాల్ టన్నెల్ (సొరంగం) లండన్ లోని గ్రీన్‌విచ్ దగ్గర ప్రారంభమైంది. ఇది థేమ్స్ నది అడుగు భాగంలో తవ్విన సొరంగం.
1984: ఎ. సర్రే అనే వ్యాపారి, చట్టవిరుద్ధంగా తన ఫోన్ ను పోలీసులు టాపింగ్ చేసారని ఆరోపించాడు. మానవ హక్కుల యూరోపియన్ కోర్ట్ ఇలా ఫోన్ టాపింగ్ చేయటం తప్పు అని, పోలీసులను మందలించింది.
1985: “లాక్‌హీడ్ ఎల్-1011 ట్రైస్టార్”కి చెందిన “డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 191”, “డల్లాస్ / ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం” వద్ద కూలిపోయింది. 137 మంది ప్రయాణీకులు, సిబ్బంది మరణించారు.
1990: ఈ రోజు ఉదయాన్నే, ఇరాక్, లక్షమంది సైనికులతో, 700 యుద్దటాంకుల దన్ను రాగా, కువైట్ మీద దురాక్రమణ చేసింది.
1990 ఇరాక్ కువైట్ ను ఆక్రమించగానే, ఎమీర్ సౌది అరేబియా పారిపోయాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఇరాకీ అక్రమణను ఖండించింది. అంతే కాదు, ఇరాక్ మీద పూర్తి దిగ్బంధం విధించింది.
2009 16మంది ప్రయాణికులతో బయలుదేరిన మెర్పాతి నుసంతారా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 9760, ట్విన్ ఓట్టర్ విమానం, పాపువా, ఇండోనేషియా ప్రాంతంలో కనిపించకుండా పోయింది.
2009 ఎయిడ్స్ (AIDS) కలిగించే కొత్తరకం వైరస్ ను, కామెరూన్ దేశంలో నివసిస్తున్న ఒక మహిళలో కనుగొన్నారు.

◆ జననాలు

1696 : ఒట్టోమన్ సుల్తాన్ మహ్మూద్-I ఆస్ట్రియన్లు & రష్యన్లుతో యుద్ధం చేసాడు. (మ. 1754 డిసెంబరు 13) .
1754 : ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) .
1832: దివ్యజ్ఞాన సమాజం (థియొసాఫికల్ సొసైటీ) యొక్క మొదటి అధ్యక్షుడు హెన్రీ స్టీల్ ఒల్కోట్
1834: ఫ్రెడెరిక్ ఆగష్ట్ బార్తోల్డి స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో చెక్కిన సింహం విగ్రహము (బెల్ఫోర్ట్ సింహం) ; (మ. 4 అక్టోబరు 1904)
1876: పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.
1878: ఇంజెబోర్గ్, స్వీడన్ యువరాణి
1880: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (మ.1946)
1892: జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు.హాలీవుడ్లో ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ ఒకటి; (మ. 9 సెప్టెంబర్ 1978) .
1924: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (మ.2014)
1934: వలెరి బైకొవ్‍స్కీ, రోదసీ యాత్రికుడు. (వోస్టోక్ 5, సోయుజ్ 22, 31 వ్యోమనౌకలలో ప్రయాణించాడు)
1944: ఆశావాది ప్రకాశరావు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు గ్రంథరచయిత, అవధాని, కవి.
1949: బెర్టలాన్ ఫర్కాస్, రోదసీలో ప్రయాణించిన మొదటి హంగరీ దేశస్థుడు. (సోయుజ్36 వ్యోమ నౌక)
1952: పాల్ డేవిడ్ క్రూస్ ఎస్సీ, హంతకుడు -ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) మోస్ట్ వాంటెడ్ జాబితా లోని వ్యక్తి)
1956: లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013)
1979: దేవి శ్రీ ప్రసాద్, దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.

◆ మరణాలు

1075: జాన్ VIII జిఫిలినస్, వేదాంతి / కానిస్టెంటినోపల్ యొక్క దేశభక్తుడు.
1923: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1847)
1923 లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 29వ అధ్యక్షుడు వారెన్ జి హార్డింగ్, శాన్ ఫ్రాన్సిస్కోలో మరణించాడు. కాల్విన్ కూలిడ్జ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు.
1934: పాల్ వాన్ హిందేన్బర్గ్ తన 86వ ఏట మరణింఛగా, అడాల్ఫ్ హిట్లర్ పదవిని స్వీకరించాడు.
1967: అసోసియేటెడ్ నీగ్రో ప్రెస్ స్థాపించిన క్లాడ్ ఎ బార్నెట్, తన 78వ ఏట మరణించాడు.
2019: దేవదాస్ కనకాల నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (జ.1945)