హైదరాబాద్ (ఆగస్టు – 01) : IBPS – PROBATIONARY OFFICER, MANAGEMENT TRAINEE JOBS RECRUITMENT 2024 NOTIFICATION ను ఈ రోజు విడుదల చేసింది. (CRP – PO/MT – XIII). ఈ నోటిఫికేషన్ ద్వారా 3,049 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది.
డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
★ వివరాలు
◆ మొత్తం పోస్టుల సంఖ్య : 3,049
◆ వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి 30
సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ,
ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
◆ దరఖాస్తు రుసుము : 850/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).
◆ తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు : అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు,
రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,
విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
◆ తెలుగు రాష్ట్రాల్లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్. వరంగల్, కరీంనగర్
★ ముఖ్యమైన తేదీలు…
◆ ఆన్లైన్ దరఖాస్తు గడువు: 01.08.2023 నుంచి 21.08.2023.
◆ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): సెప్టెంబర్ – 2023.
◆ ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: సెప్టెంబర్, అక్టోబర్ – 2023
◆ ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: అక్టోబర్, 2023.
◆ ఆన్లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్: అక్టోబర్/ నవంబర్
2023
◆ ఆన్లైన్ మెయిన్ పరీక్ష తేదీ: నవంబర్ – 2022
◆ మెయిన్ పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ – 2023
◆ ఇంటర్వ్యూ కాల్ లెటర్ : జనలి/ ఫిబ్రవరి – 2024.
◆ ఇంటర్వ్యూ : జనవరి/ ఫిబ్రవరి – 2024.
◆ వెబ్సైట్ : https://www.ibps.in/