DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st AUGUST 2023

1) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1న 466 అంబులెన్స్ లను ఒకేరోజు ప్రారంభించింది.?
జ : తెలంగాణ

2) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇన్ వాటర్ టెక్నాలజీ 2023 అవార్డును దక్కించుకున్న జలమండలి సంస్థ ఏది.?
జ : హైదరాబాద్ జలమండలి

3) 2023 మార్చి నాటికి కేంద్రం అప్పులు ఎన్ని లక్షల కోట్లు.?
జ : 155.6 లక్షల కోట్లు

4) ప్రస్తుతం భారతదేశ అప్పు స్థూల దేశియోత్పత్తిలో ఎంత శాతంగా ఉంది.?
జ : 57.1%

5) 2018 నుండి 2023 వరకు పోలీస్ కస్టడీలో 687 మంది మరణించినట్లు కేంద్ర నివేదిక చెబుతుంది ఇందులో మొదటి మూడు స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : గుజరాత్, మహారాష్ట్ర, మద్యప్రదేశ్

6) జూలై 2023 మాసానికి దేశ జిఎస్టి ఆదాయం ఎంత.?
జ : 1,65,105 కోట్లు

7) భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్ భారత్ గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎవరు నిలిచారు.?
జ : ఇషాన్ కిషన్

8) జూలై 2023 మాసానికి తెలంగాణ రాష్ట్ర జిఎస్టి ఆదాయం ఎంత.?
జ : 4,849 కోట్లు

9) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ నివేదిక ప్రకారం దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తుల విలువ ఎంత .?
జ : 54,545 కోట్లు

10) ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 50 కోట్లు గా ఉన్న డయాబెటిక్ రోగుల సంఖ్య 2050 నాటికి ఎంతకు చేరుతుందని లాన్సెట్ పత్రిక నివేదిక తెలిసింది.?
జ : 130 కోట్లు

11) జపాన్ దేశంలో ఇటీవల తీవ్ర ప్రభావం చూపిస్తున్న తుఫాన్ ఏది.?
జ : ఖనూన్

12) బుకర్ ప్రైజ్ 2024 ఎంపిక జాబితాలో చోటు సంపాదించుకున్న ప్రవాస భారతీయ రచయిత్రి, రచన ఏది.?
జ : చేతనా మరూ – వెస్ట్రన్ లేన్

13) “ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్’ అందించే ‘లోకమాన్య జాతీయ పురస్కారం’ ఎవరికి అందజేశారు.?
జ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

14) ప్రస్తుతం దేశంలో జన్ ధన్ యోజన పథకం కింద ఎన్ని బ్యాంకు ఖాతాలను భారతీయులు కలిగి ఉన్నారు.?
జ : 49 కోట్లు

15) కేంద్రం ఇటీవల తెచ్చిన సినిమాటోగ్రాఫ్ చట్టం 2023 ప్రకారం పైరసీ చేసిన నేరస్తులకు ఏ శిక్ష పడుతుంది.?
జ : 3 నెలల నుంచి 3 సంవత్సరాల జైలు, 3 లక్షల జరిమానా

16) భారతదేశ ఇటీవల ఏ దేశంతో జీవ ఇంధన రంగంలో ఒప్పందం చేసుకుంది.?
జ : ఫిన్‌లాండ్

17) భారత సైన్యం ఏ కేడర్ నుండి పై కేడర్ లకు ఒకేరకమైన యూనిఫామ్ కోడ్ ను అమలుచేయడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : బ్రిగేడర్

18) అమెజాన్ సంస్థ తన మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్ ను ఏ సరస్సులో ప్రారంభించింది.?
జ : దాల్ సరస్సు (శ్రీనగర్)