జీజేసి హుస్నాబాద్ లో తెలుగు భాష దినోత్సవం

హుస్నాబాద్ (ఆగస్టు – 29) : జాతీయ సేవా పథకం ( N.S.S) ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ నల్లా రామచంద్రారెడ్డి గారి అధ్యక్షత గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ… తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ మాతృభాషను గౌరవించాలని తెలుపుతూ మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులకు మరియు సమాజంలోని పౌరులందరికీ ఉందని అన్నారు. అలాగే తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలని తెలిపారు.

అనంతరము సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాతవాహన విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు మరియు కవి బూర్ల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ తెలుగు భాష యొక్క నేపథ్యాన్ని మరియు తెలుగు భాషలోని వ్యాకరణాన్ని గురించి పేర్కొంటూ తెలుగు భాష చాలా ప్రాచీనమైందని తెలుపుతూ తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని కవిత్వాన్ని గురించి వివరించారు.

అనంతరము కళాశాల తెలుగు అధ్యాపకులు డ. రవీందర్ గారు మాట్లాడుతూ తెలుగు భాషను అందరూ గౌరవించాలని పేర్కొంటూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు.

కళాశాలకు విచ్చేసిన తెలుగు ఆచార్యులు, కవి బూర్ల వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గారిని మరియు కళాశాల తెలుగు అధ్యాపకులు డి. రవీందర్ గారిని కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకుల బృందము మరియు అధ్యాపకేతర బృందము మరియు విద్యార్థినివిద్యార్థులు అందరూ శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డి. కరుణాకర్ గారి యొక్క పర్యవేక్షణలో జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందము ఎస్. సదానందం, బి. లక్ష్మయ్య, శ్రీమతి ఎస్ కవిత శ్రీమతి కే స్వరూప, ఏ. సంపత్, శ్రీమతి జి. కవిత, శ్రీమతి టీ. నిర్మలాదేవి, శ్రీమతి జి కవిత, పి రాజేంద్రప్రసాద్ మరియు అధ్యాపకేతర బృందము సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి టి పద్మ, రికార్డు అసిస్టెంట్ శ్రీమతి టీ. భాగ్యలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ రాములు మరియు ఆఫీస్ సబార్డినేట్ శ్రీమతి శ్వేత ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.