SENGOL : చరిత్ర – విశిష్టత

BIKKI NEWS : నూతన పార్లమెంటు భవనంలో (new parliament bhavan) స్పీకర్ కుర్చీ పక్కన చారిత్రాత్మక సెంగోల్ (SENGOL HISTORY) అనే రాజదండాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ప్రత్యేకతలు, చరిత్ర ఏమిటో చూద్దాం…

చరిత్ర : రాజరాజ చోళుడు – 1 నుంచి రాజేంద్ర చోళుడు పట్టాభిషేకం పొందుతున్న సందర్భంగా చోళుల రాజధాని తంజావూర్ లో సెంగోల్ (రాజ దండం) ను మొదటిసారిగా స్వీకరించినట్లు చరిత్ర చెబుతుంది.

1947 ఆగస్టు 14వ తేదీన తమిళనాడుకు చెందిన తమిళనాడుకు చెందిన ప్రముఖ అధీనమ్ (పుజారి), నాదస్వర కళాకారుడు రాజనాథం పెళ్లై మరియు గాయకుడు ఒడ్వార్ లు నూతన సెంగోల్ ను స్వతంత్ర భారత చివరి గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాలచారి ఆధ్వర్యంలో తయారు చేసి భారత్ స్వతంత్ర పొందుతున్న సందర్భంగా ఢిల్లీకి తీసుకువచ్చారు.

భారతదేశం స్వతంత్రం పొందుతున్న సందర్భంగా అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ భారత భావి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు స్వతంత్ర సూచికగా అందించారు.

ఇప్పుడు ఈ సెంగోల్ ను నూతన పార్లమెంటు భవనంలో స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంగోల్ (రాజదండం) పైన నంది విగ్రహం ఏర్పాటు చేయబడి ఉంది.