PALAMURU RANGAREDDY : అంకెలలో ప్రాజెక్టు విశేషాలు

BIKKI NEWS : PALAMURU RANGAREDDY LIFT IRRIGATION PROJECT DETAILS AND STATS- దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా భావించవచ్చు. ఉత్తర తెలంగాణకు కాలేశ్వరం ప్రాజెక్టు, దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు తెలంగాణ హరిత విప్లవానికి దిక్సూచిలుగా పనిచేస్తున్నాయటంలో ఎలాంటి సందేహం లేదు.

సెప్టెంబర్ 16- 2023 న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నాగర్ కర్నూల్ జిల్లా నార్లపల్లి వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు.

★ PALSMURU RANGAREDDY PROJECT STATISTICS

ప్రాజెక్టు పేరు : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

ఏ నది పై : కృష్ణా నది పై

ఎన్ని జిల్లాల పరిధి : 6 జిల్లాలు (మహాబూబ్‌నగల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్)

(ఉమ్మడి జిల్లాలు – 3 మహాబూబ్‌నగల్, నల్గొండ, రంగారెడ్డి)

జలాశయాల సంఖ్య : 6

జలాశయాల పేర్లు :

అంజనగిరి (నార్లాపూర్) – 8.41 TMC
వీరాంజనేయ (ఏదుల) – 6.55 TMC
వెంకటాద్రి (వట్టెం ) – 16.74 TMC
కురుముర్తిరాయ (కరివెన) – 17 34 TMC
ఉద్దాండపూర్ – 16.03 TMC ( రాష్ట్రంలో అత్యధిక ఎత్తులో ఉన్న రిజర్వాయర్ ఇది)

★ PALAMURU RANGAREDDY PROJECT STATS
 • ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు: 10.06.2015
 • పనులు ప్రారంభమైన సంవత్సరం : 2016
 • ప్రాజెక్టు ప్రారంభం : సెప్టెంబర్ 16 – 2023
 • ప్రాజెక్టు అంచనా వ్యయం : రూ.35,200 కోట్లు
 • సవరించిన అంచనా వ్యయం : రూ.55,086 కోట్లు
 • ఈ ఏడాది ఆగస్టు నాటికి ఖర్చు : : రూ.26,262 కోట్లు
 • 60 రోజుల్లో ఎత్తిపోసే నీటి సామర్థ్యం : 90 టీఎంసీలు
 • అప్రోచ్ కాలువల పొడవు : 12.86 కీలోమీటర్ల
 • ఓపెన్ కాలువల పొడవు: 37.625 కిలోమీటర్లు
 • సొరంగాల పొడవు : : 61.577 కిలోమీటర్లు
 • జలాశయాలపై కట్టల పొడవు : 74.70 కి.మీ.
 • మొత్తం నీటి నిల్వ సామర్థ్యం : 67.97 టీఎంసీలు
 • ప్రాజెక్టులో మొత్తం పంపులు : 34
 • పంపుల విద్యుత్ సామర్థ్యం : 4,720 మెగావాట్లు
 • తాగునీటి సౌకర్యం : 6 జిల్లాల్లోని 1,226 గ్రామాలు
 • ముంపు ప్రాంతం : 24,724 ఎకరాలు