ఘనంగా నల్ల నర్సింలు జయంతి

జనగామ (అక్టోబర్ – 02)తెలంగాణ టైగర్, జనగామ సింహం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల, తెలంగాణ ప్రజల రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత నల్ల నర్సింలు గారి జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడుసార్లు ఉరిశిక్ష పడినప్పుడు న్యాయస్థానాల్లో తన కేసును తానే వాదించుకొని విరోచితంగా పోరాడి తన పోరాటం ద్వారా తెలంగాణ టైగర్, జనగామ సింహం గా న్యాయస్థానాల ద్వారా పేరుపొందిన నల్ల నర్సింలు తన పోరాటం ద్వారా తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపి ఎంతో మందికి వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసి, వేల ప్రజలకు భూమిని పంపిణీ చేసే ఉద్యమం నిర్వహించడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, ప్రధాన కార్యదర్శి చింతల శంకర్, బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోషవ్వ, మహిళ ప్రధాన కార్యదర్శి మంజుల, బీసీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి Dr. బొల్లు రాజ్ కుమార్, కామారెడ్డి టౌన్ యూత్ అధ్యక్షులు క్యాతం శ్రీకాంత్, యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మహేష్ కుమార్, ఎల్లారెడ్డి డివిజన్ యూత్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గౌడ్, యూత్ నాయకులు రవితేజ, బీసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.