ఉల్లాసంగా, ఉత్సాహంగా జీజేసి వైరా ప్రెషర్స్ డే

వైరా (అక్టోబర్ – 13) : విద్యార్థులందరూ జీవితంలో ఆటపాటలతో పాటు అధ్యాపకుల సేవలను వినియోగించుకొని చదువు మీద శ్రద్ధ వహించాలని వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. ఈరోజు స్థానిక వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రెషర్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు చాలా ఉత్తమ ఫలితాలు సాధించారని, గత సంవత్సరం కళాశాల విద్యార్థులు శ్రీ సత్య లీనా ఉచిత ఎంబిబిఎస్ సీట్ సాధించారని, ఆశ్రిత ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సాధించిందని,ఈ సంవత్సరం నలుగురు విద్యార్థులు సత్యలీనా, ఆశ్రిత, అర్చన, అరవింద్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కు అర్హత సాధించారని తెలిపారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిష సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు పుల్లయ్య గారు వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి రామకృష్ణ పై చదువుల నిమిత్తం 15, 000/- ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో విశిష్టాధితులుగా పాల్గొన్నా వైరా బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ మాధవరావు బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి మల్లీశ్వరి వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు స్టాప్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు సబికులను ఆనందింపజేశాయి.

ఈ కార్యక్రమంలో కళాశాల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాప్ బి. వీరభద్ర రావు, జి. అనిల్ కుమార్, శ్రీనివాసరావు, ఉమా సుందరి, శ్రీనివాసరావు, బి. బాబు రావు, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, శ్రీకాంత్, అంజలి దేవి ఈశ్వరరావు, షేక్ రోషన్ బి, ఎం వెంకట ముత్యం, సిహెచ్ మధు, వై కవిత, జి సుధాకర్, సుమతి, నాగ సర్వేశ్వరావు, రవీందర్ రెడ్డి, శివ నాగమణి, నరేష్, రామకృష్ణ, రాంబాబు, ఎస్.కె షాకిర బేగం,.షేక్ జాన్, నాగేశ్వరరావు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.