చరిత్రలో ఈరోజు అక్టోబర్ 14

★ దినోత్సవం

  • ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

★ సంఘటనలు

1912: హెచ్.సి.హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు
1956: నాగపూరులో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించాడు.
1977: జ్యోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా నియామకం.
1985: అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది.
1994: బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు.
1998: అమర్త్యసేన్‌కు ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.

★ జననాలు

1643: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (మ.1712)
1877: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (మ.1937)
1909: సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలలో ఆద్యుడు. (మ.1989)
1952: వేదగిరి రాంబాబు, రచయిత (మ.2018).
1980: శివ బాలాజీ , సినీ నటుడు, వ్యాపార వేత్త.
1981: గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

★ మరణాలు

1969: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు. (జ.1886)
1982: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి. (జ.1897)
2004: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (జ.1920)
2010: సాయి శ్రీహర్ష , తెలుగు సినీ గీత రచయిత(జ.1961)
2011: జాలాది రాజారావు, తెలుగు రచయిత. (జ.1932)
2013: టి.వెంకటేశ్వరరావు, బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్, పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రాత వహించాడు.
2020: శోభానాయుడు, కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1956)