హైదరాబాద్ (ఆగస్టు – 13) : దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (EMRS RECRUITMENT 2023) పాఠశాలలో ఖాళీగా ఉన్న 10,391 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
పోస్టులను భర్తీ కోసం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) సంస్థ EMRS STAFF SELECTON EXAM 2023కు (ESSE – 2023) నోటిఫికేషన్ జారీ చేసింది.
◆ వివరాలు:
- టీజీటీ (5,660),
- వార్డెన్ (669),
- ప్రిన్సిపాల్ (303),
- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT 2, 266),
- అకౌంటెంట్ (361),
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) (759),
- ల్యాబ్ అటెండెంట్ (373)
◆ అర్హతలు :
టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ – పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీటీజీటీ – లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. (18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.)
ప్రిన్సిపాల్ :- పీజీ, బీఈడీ (50 సం. వరకు)
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) :- బీఈడీ & సంబంధించిన సబ్జెక్టులో పీజీ (40 సం. వరకు)
అకౌంటెంట్ :- డిగ్రీ (30 సం. వరకు)
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) :- సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత (30 సం. వరకు)
ల్యాబ్ అటెండెంట్ :- 10/ 12వ తరగతి (30 సం. వరకు)
◆ పరీక్ష విధానం : ఓఎంఆర్ ఆధారిత(పెన్ – పేపర్) విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు.
◆ దరఖాస్తు రుసుము : ప్రిన్సిపాల్ – 2,000/-, PGT – 1,500/-, Non Teaching – 1,000/-, టీజీటీ రూ.1500/- ; హాస్టల్ వార్డెన్ 1000/;. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తు గడువు : అక్టోబర్ – 19 – 2023.
◆ వెబ్సైట్ : https://emrs.tribal.gov.in/