INDvsPAK : 8వ సారి భారత్ జైత్రయాత్ర

అహ్మదాబాద్ (అక్టోబర్ – 14) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా భారత్, పాకిస్తాన్ (INDvsPAK) జట్ల మద్య మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచి… వరల్డ్ కప్ లో తన అజేయ జైత్రయాత్రను కొనసాగించింది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ (86) వీరవిహరం తో పాకిస్థాన్ స్పీడ్ బౌలింగ్ ను చీల్చి చెండాడి… వార్ వన్‌సైడ్ చేశాడు. రోహిత్ కు తోడు శ్రేయస్ అయ్యర్ (55) తో రాణించాడు. గిల్ (16), కోహ్లీ (16), రాహుల్ (18) పరుగులు చేశారు.

అంతకు ముందు.. పాకిస్థాన్ జట్టు 191 పరుగులకే 191 ఆలౌట్ అయింది. భారత స్పీడ్ గన్స్ బుమ్రా, సిరాజ్, హర్దిక్ ల దాటికి 42 4 ఓవర్లకే 191 పరుగులు చేసి 9వికెట్లు కోల్పోయింది. బాబర్ ఆజమ్ 50, రిజ్వాన్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా – 2, సిరాజ్ – 2, కుల్దీప్ – 2, హర్దిక్ పాండ్యా – 2, జడేజా – 2 వికెట్లు తీశారు.

ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ లలో భారత్ పాకిస్తాన్ 8 సార్లు తలపడగా 8 సార్లు భారత్ గెలవడం విశేషం.