EKALAVYA JOBS : 6,329 TGT, WARDEN ఉద్యోగాలు

హైదరాబాద్ (జూలై – 19) : దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (EMRS RECRUITMENT 2023) పాఠశాలలో ఖాళీగా ఉన్న 6329 TGT, WARDEN POSTS RECRUITMENT పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 5,660 TGT పోస్టులను, 669 WARDEN పోస్టులను భర్తీ చేయనున్నారు.

◆ ఖాళీల వివరాలు:

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT): 5,660 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ (మేల్), పీఈటీ (ఫిమేల్),
లైబ్రేరియన్.

హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు

హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు

◆ మొత్తం ఖాళీలు : 6,329.

◆ అర్హతలు టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ,
బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

టీజీటీ – పీఈటీ
పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ;

టీజీటీ – లైబ్రేరియన్ పోస్టులకు
డిగ్రీ, బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

◆ వయోపరిమితి: ఆగస్టు 18 -2023 నాటికి 18-35 సంవత్సరాల
మధ్య ఉండాలి.

◆ జీత భత్యాలు : నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44,900 –
1,42,400/ మరియు రూ.35,400 – 1,12,400;

హాస్టల్ వార్డెను కు రూ.29,200 – 92,300/-

◆ పరీక్ష విధానం : ఓఎంఆర్ ఆధారిత(పెన్ – పేపర్) విధానంలో
ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు.

టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు),

లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు (30 ప్రశ్నలు) కేటాయించారు.

హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు)
కేటాయించారు.

టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

◆ దరఖాస్తు రుసుము : టీజీటీ రూ.1500/- ; హాస్టల్ వార్డెన్
రూ.1000/;. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రుసుము
చెల్లించాల్సిన అవసరం లేదు.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు గడువు : ఆగస్టు – 18 – 2023.

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://emrs.tribal.gov.in/

Comments are closed.