హైదరాబాద్ (సెప్టెంబర్ – 21) : 5 089 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నవంబర్ 20 నుండి 30 వరకు నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్ (DSC (TRT) 2023 DETAILED EXAMS SCHEDULE) ను విద్యాశాఖ విడుదల చేసింది.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
ఈ టీచర్ ఉద్యోగ నియామక పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో జరగనున్నాయి. రోజుకు రెండు సెక్షన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం 9 గంటల నుండి 11:30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం
పరీక్షను 80 మార్కులకు నిర్వహిస్తారు. 160 ప్రశ్నలు ఉంటాయి. 20 మార్కులకు టెట్ వెయిటేజీ ఉంటుంది. పీఈటీ వారికి టెట్ ఉండదు కాబట్టి వారికి 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
DSC (TRT) EXAM SCHEDULE :
నవంబర్ – 20 :- స్కూల్ అసిస్టెంట్ భాషా సబ్జెక్టులు
నవంబర్ – 20, 21 :- స్కూల్ అసిస్టెంట్ భాషేతర సబ్జెక్టులు
నవంబర్ – 23 :- పీఈటీ అన్ని మాధ్యమాలు
నవంబర్ – 24 :- భాషా పండితులు
నవంబర్ – 25 – 30 :- సెకండరీ గ్రేడ్ టీచర్ (అన్ని మాధ్యమాలలో)