PRC & IR : త్వరలోనే ఉద్యోగులకు తీపి కబురు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 21) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే రెండో పి ఆర్ సి కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నెలాఖరులోగా జరగనున్న మంత్రి మండలి సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అక్టోబర్ మొదటి లేదా రెండో వారాలలో ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యో అవకాశం ఉన్న నేపథ్యంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దల నుండి వివిధ శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఉద్యోగులకు ఐఆర్ ను దాదాపు 12 నుండి 20% మధ్య ప్రకటించే అవకాశం ఉందని… ముఖ్యమంత్రి కేసీఆర్ 20 శాతానికి మించి కూడా ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

పెండింగులో ఉన్న మూడు డీఏలలో ఒకదాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 2023 జూలై 1 నుండి పీఆర్సీ అమలు కావలసి ఉంది