DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd AUGUST 2023

1) ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన కంపెనీ ఏది.?
జ : వాల్‌మార్ట్

2) ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో భారత్ నుండి ఏడు కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి. మొదటి స్థానంలో ఉన్న కంపెనీ ఏది.?
జ : రిలయన్స్ 88వ స్థానం

3) మిస్ ఓరేగాన్ యూఎస్ 2023 గా నిలిచిన ప్రవాస భారతీయ సుందరి ఎవరు.?
జ : మంజు

4) కేంద్ర సంస్థ నివేదిక ప్రకారం బాస్మతి బియ్యాన్ని భారతదేశం ఎన్ని దేశాలకు ఎగుమతి చేస్తుంది.?
జ : 143 దేశాలకు

5) బాస్మతి బియ్యం ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రస్థానంలో (60%) ఉన్న రాష్ట్రం ఏది.?
జ : హర్యానా

6) పాము కాటు వలన జరిగే మరణాలను, వైకల్యాలను ఏ సంవత్సరం నాటికి 50% తగ్గించాలని ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.?
జ : 2050

7) విదేశాలలో మరణించిన భారతీయుల మృతదేహాలను వేగంగా భారతదేశానికి తీసుకు రావడానికి కేంద్రం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి?
జ : ఈ – కేర్

8) ఫిపా మహిళల ఫుట్ బాల్ ప్రపంచ కప్ 2023 టోర్నీ ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : ఆస్ట్రేలియా

9) బెర్లిన్ లో జరుగుతున్న ప్రపంచ అర్చరీ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ కు చేరిన భారత ఆర్చర్లు ఎవరు.?
జ : జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం

10) ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : తమిళనాడు – భారతదేశం

11) ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ను తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : కోహెడ

12) గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఎంత శాతం వాటాను రిజర్వేషన్ కింద కల్పించారు.?
జ : ఐదు శాతం

13) ఏ సమస్త అమెరికా యొక్క క్రెడిట్ రేటింగ్ ను AAA నుండి AA+ కు డౌన్ గ్రేడ్ చేస్తూ నివేదిక ఇచ్చింది.?
జ : ఫిచ్

14) బ్యాక్టీరియా నుండి బయోడిగ్రెడబుల్ ప్లాస్టిక్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.?
జ : అమెరికా

15) జాతీయ అవయవ దాన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు – 03

16) “స్టేట్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డీసీజ్డ్ డోనర్స్ అవార్డు – 2022” ను అందుకున్న రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ