ప్రకృతిని అరాధించే పండుగే బతుకమ్మ – జిల్లా ఇంటర్ విద్యాధికారి బైరి శ్రీనివాస్

జనగామ (అక్టోబరు – 18) : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకoచ, జనగామ నందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన కళాశాల బతుకమ్మ సంబరాలలో జనగాం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బైరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ పండుగ అని, ప్రపంచములో ఎక్కడ లేని పూల పండుగ సంప్రదాయం మన తెలంగాణాలో ఉండడం ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. అలాగే మన తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను నేటి విద్యార్థులకు తెలిపి భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులపైన ఉందని బైరి శ్రీనివాస్ తెలిపారు.

పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోనే పండుగే బతుకమ్మ అని కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ వేముల శేఖర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల జాతీయ సేవా పథకం పోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, మరిపెల్ల రవిప్రసాద్, మహిళా అధ్యాపకులు శతి నందిని పటేల్, వరుధిని, రజిత, ప్రియదర్శిని, రేఖ, సబిహా బేగం, ఇశ్రాత్ భాను మరియు విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.