మచిలీపట్నం (అక్టోబర్ – 18) : ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులను (krishna district staff nurse and medical officer jobs ) ఆహ్వానిస్తోంది.
★ ఖాళీల వివరాలు :
స్టాఫ్ నర్స్: 24
మెడికల్ ఆఫీసర్: 10
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్: 8
ఎల్డీఎస్: 4
సపోర్టింగ్ స్టాఫ్: 3
ఫిజియోథెరపిస్ట్: 2
సెక్యూరిటీ గార్డ్: 1
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సర్టిఫికెట్ కోర్సు, జీఎన్ఎం/ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంబీబీఎస్.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
చిరునామా : దరఖాస్తులను ‘జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, పరాసుపేట, నాయర్ బడ్డి సెంటర్, మచిలీ పట్నం, కృష్ణా జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు గడువు : అక్టోబర్ 20 – 2023.