4% D.A. – ఉద్యోగులకు 4% డీఏ పెంపు

న్యూడిల్లీ (అక్టోబర్ – 04 ) : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు నాలుగు శాతం డీఏ(4% Dearness Allowance to central govt employees) పెంచేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనిపై ఈరోజు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ది.

జూలై 1, 2023 నుంచి పెరిగిన డీఏ అమలులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉద్యోగుల‌కు డీఏ రేటు 42 శాతంగా ఉంది. ఒక‌వేళ 4 శాతం పెరిగితే, అప్పుడు అది 46 శాతానికి పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.