ఆస్తానా (మే – 01) : ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2023 ను చైనా గ్రాండ్ మాస్టర్ లిరెన్ డింగ్ (world chess championship 2023 won by liren ding) కైవసం చేసుకున్నాడు. ఈ టైటిల్ గెలిచిన తొలి చైనా ఆటగాడు డింగ్. కజకిస్థాన్ లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్షిప్ లో రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నిపోమ్నియాషిపై చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ గెలుపొంది కార్ల్ సన్ వారసుడిగా నిలిచాడు.
చాంపియన్షిప్ పోరులో 14 గేమ్ లు అనంతరం ఇరువురూ చెరి 7 పాయింట్లతో సమంగా నిలవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. నాలుగు గేమ్ ల టైబ్రేక్ లో తొలి మూడు గేమ్ లు డ్రా కాగా చివరి గేమ్ ను గెలుచుకుని డింగ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.