World Post Day – ప్రపంచ తపాలా దినోత్సవం

BIKKI NEWS : ప్రపంచ తపాలా దినోత్సవం (World Post Day – వరల్డ్ పోస్ట్ డే) ను ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాపంగా అక్టోబరు 09 న జరుపుకుంటారు.

Postal Day 2023 Theme

“Together for trust: Collaborating for a safe and connected future.”

స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపనకు గుర్తుగా, సంస్థ స్థాపించిబడిన అక్టోబరు 9 న ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ప్రపంచ వ్యాప్తంగా ఇతరులకు రాయడానికి అనుమతించే గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవం యొక్క ఆరంభం.

1969 లో టోక్యో, జపాన్ లో జరిగిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సమావేశంలో మొదట ఈ ప్రపంచ తపాలా దినోత్సవం ప్రకటించబడింది. అప్పటి నుండి, తపాలా సేవల యొక్క అవసరాన్ని గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 9 న ఈ ప్రపంచ తపాలా దినోత్సవమును జరుపుకుంటున్నారు.