న్యూయార్క్ (జూలై – 11): జూలై – 11 న ప్రపంచ జనభా దినోత్సవంను పురష్కారించుకుని ఐఖ్య రాజ్య సమితి “2022 ప్రపంచ జనాభా అంచనాలు” పేరు మీద నివేదిక విడుదల చేసింది…
◆ నివేదికలో ముఖ్యాంశాలు…
1) ప్రపంచ జనాభా 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరనుంది.
2) 600 కోట్లు నుండి 700 కోట్లు చేరడానికి 12 సంవత్సరాలు పడితే… 700 కోట్లు నుండి 800 కోట్లు చేరడానికి కూడా 12 సంవత్సరాలే పట్టింది.
3) 900 కోట్లకు చేరడానికి మరో 14.5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.
4) 2080 నాటికి 1000 కోట్ల జనాభా భూమి మీద ఉండనుంది.
5) జనాభా పెరుగుదలలో ఆసియా వాటా 50% పైనే, ఆప్రికా వాటా 40% పైనే.
6) జనాభా వృద్ధి అధికంగా ఉన్న దేశాలు వరుసగా ఇండియా, చైనా, నైజీరియా
7) 2023 లో భారత్ చైనా జనాభా ను దాటి అత్యధిక జనాభా కలిగిన దేశాలలో మొదటి స్థానంలో నిలవనుంది.
8) ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం – 72.8 సంవత్సరాలు
9) ప్రస్తుత చైనా జనాభా 142.6 కోట్లు కాగా భారత జనాభా 141.2 కోట్లు.
10) 2050 నాటికి భారత జనభా 166.8 కోట్లకు చేరుకుంటే చైనా జనాభా 131.7 కోట్లకు తగ్గే అవకాశం ఉంది.
11) యువ జనాభా అధికంగా ఉన్న దేశం భారతదేశం. వృద్ధ జనాభా ఎక్కువగా ఉన్న దేశం జపాన్.
12) గ్రామీణ జనాభా కంటే పట్టణ జనాభా మొదటి సారి 2007వ సంవత్సరం లో నమోదు అయింది.
13) 2050 నాటికి పట్టణ జనాభా 66 శాతానికి పెరగనుంది.
14) ప్రస్తుత సంతానోత్పత్తి రేటు 2.5 కంటే తక్కువ
15) 2000 – 2020 మధ్య జనాభా వార్షిక వృద్ధి రేటు 1.2%