BIKKI NEWS. : ప్రపంచ దేశాల ఆకలి లెక్కలను చూసే GLOBAL HUNGER INDEX 2020 నివేదిక లో (GHI) 107 దేశాల్లో సర్వే జరిపితే.. భారత దేశం 94వ స్థానంలో నిలిచింది.
దేశంలో ఇంకా 14శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సూచీలో ఆర్థికంగా, సామాజికంగా కాస్త మనకన్నా వెనుకబడిన దేశాలు మనకన్నా మెరుగైన స్థానంలో నిలిచాయి. గతేడాది మన దేశం 102వ ర్యాంక్ నుంచి 94వ స్థానానికి చేరుకుంది.
మన పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్ మనకంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆకలి స్థాయిలు, పోషకాహారలోపాన్ని లెక్కించే సూచిక శుక్రవారం విడుదలైంది. నేపాల్, బంగ్లాదేశ్ వరుసగా 73, 75 ర్యాంకులను సాధించగా, పాకిస్థాన్ 88వ స్థానాల్లో ఉన్నాయి.
వెల్తుంగర్‌హిల్ఫ్, కన్సర్న్ వరల్డ్‌వైడ్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 27.2 స్కోరుతో దేశంలో ఆకలి స్థాయి తీవ్రంగా ఉంది. ఈ నివేదిక 132 దేశాల పరిస్థితిని అంచనా వేసినప్పటికీ.. 107 దేశాలకు డేటాను విడుదల చేసింది.
టాప్ – 5 దేశాలు ::
1. బెలారస్
2. బోస్నియ/హెర్జగోవినా
3. బ్రెజిల్
4. చిలీ
5. చైనా
94. భారతదేశం
చివరి – 3 దేశాలు ::
105. మడగాస్కర్
106. తైమూర్ – లెస్టే
107. చాద్
కొవిడ్ -19 మహమ్మారి చాలా మందికి ఆహారం, పోషకాహార భద్రతను దెబ్బతీసింది. దీని ప్రభావం భవిష్యత్‌పై పడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ప్రస్తుత నివేదిక ఆకలి, పోషకాహారలోపంపై కొవిడ్ -19 ప్రభావాన్ని ప్రతిబింబించదని పేర్కొంది.
ఇండియాలో ఆకలి కేకలు ఎక్కువవడానికి కారణం పెరుగుతున్న జనాభేనని జీహెచ్‌ఐ అభిప్రాయపడింది. జనాభా పెరుగుతున్న కొద్దీ చాలా మంది పోషకాహార లోపానికి బాధితులవుతున్నారని పేర్కొంది. మన దేశంలోనే ఎక్కువగా పిల్లలు బక్కచిక్కిపోతున్నారని (చైల్డ్ వేస్టింగ్) పేర్కొంది. గతేడాది చైల్డ్ వేస్టింగ్ రేటు 20.8శాతం ఉండగా.. కొద్దిగా మెరుగై 17.3శాతానికి చేరింది.
పుట్టుకతో వచ్చే ఆస్ఫిజియా లేదా ట్రామా, నియోనేటల్ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, డయేరియాతో పిల్లల మరణాల రేటు చాలా వరకు తగ్గిందని నివేదిక పేర్కొంది. మెరుగైన ప్రసూతి సంరక్షణ, విద్య, పోషణతో పాటు రక్తహీనత, నోటి పొగాకు వాడకం తగ్గింపు వంటి చర్యల ద్వారా అధిగమించిందని తెలిపింది.
2020 జీహెచ్‌ఐ ప్రకారం.. ర్యాంకు పొందిన ఏ దేశం ఆకలిపై ‘అత్యంత ప్రమాదకరమైన’ విభాగంలోకి రావు. చాద్, తైమూర్-లెస్టే, మడగాస్కర్ దేశాలు ‘ప్రమాదకరమైన’ కేటగిరీకిందకు వచ్చాయి.
నివేదికPDF FILE
పూర్తి నివేదిక కోసం ::క్లిక్