బుకర్ ప్రైజ్ విజేత – 2020

స్కాట్‌లాండ్‌-అమెరికా ర‌చ‌యిత డ‌గ్ల‌స్ స్టువార్ట్‌ ఈ ఏడాదికిగాను బూక‌ర్ ప్రైజ్ విజేత గా నిలిచారు.  డ‌గ్ల‌స్ రాసిన “ష‌గ్గి బెయిన్” అనే న‌వ‌ల‌కు ఈ ఏడాది బుకర్ ద‌క్కింది

● నవలలోని కథాంశం ::

 గ్లాస్‌గోవ్‌లో పేదరికంలో పెరిగిన ర‌చయిత డ‌గ్ల‌స్ త‌న జీవిత విశేషాల‌ను ఆ న‌వ‌ల‌లో వివ‌రించారు.  మ‌ద్యానికి బానిసైన త‌న త‌ల్లి గురించి ర‌చ‌యిత డ‌గ్ల‌స్ రాశాడు.  వ్య‌స‌నాల నుంచి త‌న త‌ల్లి ఎలా ఇబ్బంది ప‌డిందో కూడా ఆ న‌వ‌ల‌లో ఆయ‌న రాశారు. 44 ఏళ్ల స్టువార్ట్ త‌న‌ను తాను వ‌ర్కింగ్ క్లాస్ కిడ్ అని చెప్పుకున్నారు.  స్కాట్‌లాండ్‌కు చెందిన ర‌చ‌యిత బూక‌ర్ ప్రైజ్‌ను గెలుచుకోవ‌డం ఇది రెండ‌వ‌సారి.  1994లో స్కాటిష్ ర‌చ‌యిత జేమ్స్ కెల్మ‌న్ బూక‌ర్ గెలుచుకున్నారు. బూక‌ర్ ప్రైజ్ విజేత‌కు 50వేల పౌండ్లు ఇవ్వ‌నున్నారు.

● బుకర్ బహుమతి గురించి ::

మాన్ బుకర్ బహుమతి (Man Booker Prize) లేదా బుకర్ బహుమతి (Booker Prize) ఆంగ్ల సాహిత్యంలో పూర్తి నిడివి ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండు, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారం 1968 సంవత్సరంలో మొదలైంది. 1969 నుంచి బహుమతి ఇవ్వడం మొదలైంది.

● మొదటి విజేత ::

P. H. Newby (U.K.)

“Something to Answer For” (1969)

● భారత విజేతలు ::

1) V.S. నైపాల్ – “In a Free State” (1971)

2) సల్మాన్ రష్దీ –  “Midnight’s Children” (1981)

3) అరుంధతి రాయ్- “The God of Small Things”(1997)

4) కిరణ్ దేశాయ్ “The Inheritance of Loss” (2006)

5) అరవింద్ అడిగా – “The White Tiger” (2008)