RSAvsSL : సౌతాఫ్రికా ఘనవిజయం

న్యూడిల్లీ (అక్టోబర్ – 08) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా సౌతాఫ్రికా , శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. (South Africa won the match )

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక బౌలర్లకు సఫారీ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ (100), వాన్‌డర్ డుసెన్ (108), మార్క్రమ్ (106) సెంచరీలతో చెలరేగి ఆడి వన్డే ప్రపంచ కప్ చరిత్ర లోనే అత్యధిక స్కోర్ 428/5 పరుగులు చేశారు.

ఇప్పటివరకు ప్రపంచ కప్ లో అత్యధిక స్కోర్ 2015 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు అఫ్ఘనిస్తాన్ జట్టు పై చేసిన 417 పరుగులే అత్యధికం .

అనంతరం ఘనంగా బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక 10 ఓవర్లలో 94 పరుగులు చేసి లక్ష్యం వైపు పయనించిన వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలైంది. అసలంక 79, మెండీస్ – 76, శనక 68 పరుగులతో రాణింంచారు . కోయిట్జ్ 3 వికెట్లు తీశాడు.