శాతవాహన వర్శిటీలో తాత్కాలిక ప్రాతిపాదికన రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్

కరీంనగర్ (అక్టోబర్ – 07) : శాతవాహన విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ రీసెర్చ్ (ICSSR) – న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో “గ్రామీణ తెలంగాణలో సుకన్య సమృద్ధి యోజనపై అధ్యయనం -ఆర్థిక సమ్మిళితం కోసం జాతీయ పథకం” అనే అంశంపై స్వల్పకాలిక ప్రాజెక్టుకు పరిశోధన చేయడానికి 4 నెలలకు గాను తాత్కాలిక ప్రాతిపాదికన ఒక రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 10-10-2023 లోపు దరఖాస్తు చేసుకోగలరని ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీవాణి, కో డైరెక్టర్ కె. పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హతలు, నియామక పద్దతి వంటి పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ చూడగలరని పేర్కొన్నారు.

వెబ్సైట్ : https://satavahana.ac.in/