JOBS : వైద్య కళాశాలల్లో భారీ వేతనంతో అధ్యాపక ఉద్యోగాలు

హైదరాబాద్ (అక్టోబర్ – 07) : తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరెట్ కాంట్రాక్టు పద్ధతిలో రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలు, సర్వజన హస్ప లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పోస్టులను భారీ వేతనంతో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది.

ఖాళీల వివరాలు : వికారాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో పై పోస్టులు ఖాళీగా కలవు.

విభాగాలు : అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ వంటి విభాగాలలో పీజీ చేసిన అభ్యర్థులు అక్టోబర్ 15 లోగా ధ్రువపత్రాలను స్కాన్ చేసి ఈ- మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్, డి ఎన్ బీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి : 69 సంవత్సరాల లోపు ఉండాలి.

వేతనం : 1.25 లక్షల నుంచి 1.90 లక్షల వరకు

ఎంపిక విధానం : పీజీ మార్కులు, అని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు గడువు : అక్టోబర్ 15 – 2023

కౌన్సిలింగ్ తేదీ : అక్టోబర్ 20 – 2023

నియామక తేదీ : నవంబర్ 1 – 2023

మెయిల్ అడ్రస్ : dmerecruitment.contract@gmail.com

వెబ్సైట్ : https://dme.telangana.gov.in/