హైదరాబాద్ (సెప్టెంబర్ – 20) : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో 5,089 ఫీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి నేటి నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసింది. 51% ఉద్యోగాలు మహిళలకే కేటాయింపు చేయడం జరిగింది. (women’s has 50% posts in ts Dsc notification 2023 )
ఈ నేపథ్యంలో నూతన జిల్లాల వారీగా, కేడర్ల వారీగా రిజర్వేషన్లతో కూడిన రోస్టర్ పట్టికను విడుదల చేసింది. దీని ప్రకారం 51% ఉద్యోగాలు మహిళలకే కేటాయించారు.
మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీలలో 2,598 పోస్టులు మహిళలకు, 2,491 పోస్టులు పురుషులకు దక్కనున్నాయి.
ప్రస్తుతానికి మహిళలకు వర్టికల్ విధానంలోనే రోస్టర్ రిజర్వేషన్ ఉంటుందని.. నియామకాల సమయానికి ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా వర్టికల్ రిజర్వేషనా లేక ఆరిజంటల్ రిజర్వేషనా అని నిర్ణయిస్తామని విద్యాశాఖ తెలిపింది.