VRA REGULARIZATION : కేసు ఉపసంహరణకు ప్రయత్నాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 30): VRO లను ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసినా, కోర్టు కేసు కారణంగా ఇబ్బందులు పడుతున్న వీఆర్ఏ ల క్రమబద్ధీకరణ పై హైకోర్టులో కేసు
వేసిన ఆఫీస్ సబార్డినేట్లు తన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఈమేరకు వీఆర్ఏ ల సంఘ నేతలు, ఆపీస్ సబార్డినేట్ ల మద్య జరిగిన చర్చలు ఫలవంతమై కేసు ఉపసంహరణకు కేసు వేసిన 30 మంది అంగీకరించారని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఎలను క్రమబధీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై 24న ఉత్తర్వులు విడుదల చేసింది. వారి విద్యాభ్యాసం మేరకు వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. దీనిపై రెవెన్యూశాఖ కు చెందిన 30 నుంది ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టును ఆశ్రయించారు. ముందుగా తమకు పదోన్నతులు కల్పించాలని, ఆ తర్వాతే వారి నియామకాలు చేపట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆగస్టు 10న వీఆర్ఎల క్రమబద్ధీకరణపై స్టే విధించింది.