DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th SEPTEMBER 2023

1) ఆగస్టు – 2023 కు గాను ఎమర్జింగ్ మార్కెట్లలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : భారత్

2) ఆసియన్ గేమ్స్ 2023లో ఏ ఈవెంట్లో భారత్ స్వర్ణం మరియు రజతం నెగ్గింది.?
జ : మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం

3) ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లో భూకంపం ముందస్తు సమాచారాన్ని అందించడానికి భారత్ లో NDMA, NSCలతో ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది.?
జ : గూగుల్

4) ఆసియన్ గేమ్స్ 2023లో 41 సంవత్సరాల తర్వాత ఏ ఈవెంట్లో భారత్ స్వర్ణం నెగ్గింది.?
జ : హర్స్ రైడింగ్ (ఈక్వేస్ట్రేయన్)

5) ఒడిస్సా రాష్ట్రానికి మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు ఇటీవల నియమితులయ్యారు.?
జ : ప్రమీల మాలిక్

6) భారత సైన్యానికి చెందిన ఎలైట్ పారా స్పెషల్ ఫోర్సెస్ లో మొట్టమొదటి మహిళా సర్జన్ గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : మజోర్ డా. పాయల్

7) బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ ప్రయోగాల కోసం ఏ సంస్థ అమెరికాకు చెందిన ఎస్ డి ఏ అనుమతి పొందింది.?
జ : న్యురాలింక్స్

8) జూన్ 29న ట్రేడర్స్ వెల్ఫేర్ డే గా ఏ రాష్ట్రం ప్రకటించింది.?
జ : ఉత్తర ప్రదేశ్

9) జాతీయస్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ విభాగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారానికి ఏమని పేరు పెట్టారు.?
జ : రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్

10) 14వ వరల్డ్ స్పేస్ కాంగ్రెస్ కు అతిథ్యం ఇస్తున్న నగరం ఏది.?
జ : వసి – నవీ ముంబై

11) కేంద్రం ప్రారంభించిన “స్కిల్స్ ఆన్ వీల్స్” కార్యక్రమము ఉద్దేశ్యం ఏమిటి.?
జ : గ్రామీణ యువతలో నైపుణ్యాల పెంపుదల

12) జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కంటే 4 రెట్లు పెద్దదైన ఏ టెలిస్కోప్నో నాసా తయారు చేస్తుంది.?
జ : జాయింట్ మగలాన్ టెలిస్కోప్

13) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏ సంవత్సరం వరకు కూల్చివేయాలని నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.?
జ : 2031

14) 2023 – 24 మొదటి ఆర్థిక త్రైమాసికంలో భారత దేశ అప్పు ఎన్ని లక్షల కోట్లకు చేరింది.?
జ : 159.53 లక్షల కోట్లు

15) రష్యాలో ఉండే కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపుకు నూతన అధిపతిగా ఎవరిని రష్యా అధ్యక్షుడు నియమించారు.?
జ : అండ్రి ట్రోషెవ్

16) ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శాంత కుమార్

17) బాలికల లైంగిక సమ్మతి వయస్సును ఎన్ని సంవత్సరాలుగా ఉంచాలని లా కమిషన్ సిఫార్సు చేసింది.?
జ : 18

18) తెలంగాణ రాష్ట్రంలో ని జీనోమ ర్యాలీలో 16,500 కోట్ల పెట్టుబడితో జీవ వైద్య రంగాల్లో పరిశ్రమలు స్థాపించనున్న సంస్థ ఏది.?
జ : అడ్వెంట్ ఇంటర్నేషనల్