VRA REGULARIZATION G.O. విడుదల

హైదరాబాద్ (జూలై – 24) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం VRA REGULARIZATION G.O. ను విడుదల చేసింది. మొత్తం 20,555 మంది వీఆర్వో లను ( Village Revenue Assistant regularization go copy)లను వివిధ కేటగిరీలు విభజిస్తూ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేశారు.

పదవ తరగతి వరకు చదివిన వారు 10,317 మందిని లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (రూ.19000-58850) గా క్రమబద్దీకరణ చేయనున్నారు.

ఇంటర్ వరకుచదివిన 2,761 మందిని రికార్డు అసిస్టెంట్ (రూ.22240-67300) లుగా క్రమబద్ధీకరణ చేయనున్నారు

డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివిన 3,680 మందిని జూనియర్ అసిస్టెంట్లు (రూ. 24280-72850) లుగా క్రమబద్ధీకరణ చేయనున్నారు.

61 సంవత్సరాలు దాటిన 3,797 మంది వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

వీరిలో ఇరిగేషన్ శాఖకు 5,073 మందిని, మిషన్ భగీరథకు 3,372 మందిని, వ్యవసాయ శాఖ కు 2,600 మందిని, రెవెన్యూ శాఖకు 1,700 మందిని, MAUD శాఖకు 1,000మందిని, పంచాయతీ రాజ్, హెల్త్, విద్యా శాఖలకు 3,016 మందిని కేటాయించారు.