కమీషనర్ ని కలిసిన చరిత్ర పరిరక్షణ సమితి సభ్యులు

హైదరాబాద్ (జూలై – 24) : జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ చైర్మన్ సి హెచ్ కనక చంద్రం ఆధ్వర్యంలో సోమవారం రోజున ఇంటర్మీడియట్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారిని కలిసి చరిత్ర జూనియర్ లెక్చరర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యపై వినతి పత్రం సమర్పించినట్లు చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. పోతరవేణి తిరుపతి ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఆధునిక అవకాశాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యలో హెచ్.ఇ.సి. కోర్సును నవీకరణ చెయ్యాలని విన్నవించగా కమీషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. కమిషనర్ గారిని కలిసి వారిలో చరిత్ర పరిరక్షణ సమితి సభ్యులు రాంచంద్రయ్య, మంగ్త్యా నాయక్, సీతరామయ్య, డా. వరూధిని, ప్రణిత, వందన తదితరులు ఉన్నారు.