BIKKI NEWS : 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కేంద్ర సాదరణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
★ మొత్తం బడ్జెట్ :
- 2023-24 మొత్తం బడ్జెట్ రూ.45.03 లక్షల కోట్లు
- మొత్తం టాక్స్ రూపేణా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు
- కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ 10.22 లక్షల
- ఇన్కం టాక్స్ రూపేణా వచ్చేది రూ.9.01 లక్షల కోట్లు
- GST ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.9.57 లక్షల కోట్లు
★ మొత్తం ఖర్చు
- ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు
- వివిధ పథకాల కోసం ప్రణాళిక ద్వారా చేసే వ్యయం రూ. 19.44లక్షల కోట్లు
- వివిధ రంగాల్లో కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు
- పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా రూ.5.13 లక్షల కోట్లు
★ ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్
- సమ్మిళిత అభివృద్ధి
- చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు
- భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు
- దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట
- పర్యావరణ అనుకూల అభివృద్ధి
- యువ శక్తి
- పటిష్టమైన ఆర్థిక రంగం
★ కేంద్ర బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు
- రక్షణశాఖ – రూ.5.94 లక్షల కోట్లు
- రోడ్డు, హైవేలు – రూ.2.70 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధి శాఖ – రూ.1.6 లక్షల కోట్లు
- వ్యవసాయ శాఖ – రూ.1.25 లక్షల కోట్లు
- రైల్వే శాఖ – రూ.2.41 లక్షల కోట్లు
- పౌరసరఫరాల శాఖ – రూ.2.06 లక్షల కోట్లు
★ ఇన్‌కం ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు
- ఆదాయపు పన్ను మినహాయింపు రూ.5 నుంచి 7 లక్షల వరకు పెంపు
- ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్నులు ఉంటాయి.
- రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను
- రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం
- రూ. 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం
- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
- రూ.15 లక్షలకు పై ఉంటే 30 శాతం పన్ను
15 లక్షలు దాటితే 30 శాతం పన్ను
◆ ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌వైపు చూస్తోంది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెట్టింపు అయ్యింది. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం.
◆ కళాకారుల బ్రాండ్ ప్రమోషన్‌కు చర్యలు తీసుకుంటున్నాం. కళాకారులు, హస్తకళాకారులకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈలతో కళాకారులను అనుసంధానం చేస్తున్నాం.
◆ టూరిజం రంగంలో భారత్‌కు అనేక అవకాశాలు ఉన్నాయి. పర్యాటక రంగ ప్రోత్సాహానికి విస్తృత చర్యలు చేపట్టాం. హరిత ఇంధనం కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాం.
◆ సప్తరుషుల రీతిలో బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యత. సమిష్ఠి ప్రగతి దిశగా అనేక చర్యలు చేపడుతున్నాం.
◆ వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెట్ సదుపాయం అందిస్తున్నాం.
◆ వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాం.
◆ పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నాం.
◆ చిరుధాన్యాలు ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. చిరుధాన్యాల ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జొన్న, రాగి, బార్లీ, ఇలా ఎన్నో సిరిధాన్యాలు పండిస్తున్నాం.
◆ సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం
◆ మత్యకారుల కోసం రూ.6వేల కోట్లు
◆ 11.7 కోట్ల మందికి ఉచితంగా టాయిలెట్స్ నిర్మించి ఇచ్చాం. మహిళల కోసం మరిన్ని పథకాలు అమలు చేశాం. 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తాం. పీఎం విశ్వకర్మ యోజన తీసుకొస్తాం.
◆ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చేయుత అందిస్తాం. ప్రైవేటు ప్రభుత్వ పరిశోధనల కోసం ICMR ల్యాబ్స్ ఏర్పాటు
◆ పంచాయతీ స్థాయిలో పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు
విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిపెంచేందుకు చర్యలు చేపట్టాం. ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు అందజేస్తాం.
◆ ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం
◆ PVTG గిరిజనుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు కేటాయించాం.
◆ కర్ణాటకలోని కరవు పీడిత ప్రాంతాలకు రూ. 5వేల కోట్లు
◆ పీఎం ఆవాస్ యోజన కింద రూ.79వేల కోట్లు
◆ పురాతన తాళపాత్రల డిజిటలైజేషన్ కోసం ప్రత్యే చర్యలు.
◆ దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు తీసుకొస్తున్నాం. సహకార సంఘానికి బడ్జెట్‌లో పెద్ద పీట. పీఎం ఆవాస్ యోజనకు 66 శాతం నిధుల పెంపు
◆ 81 లక్షల సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులకు చేయూత. 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్ కోసం రూ.2వేల కోట్లు- మెడికల్ కాలేజీలతో పాటు దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం.
◆ ఎస్సీ వర్గాలకు రూ.15వేల కోట్లు కేటాయింపు
◆ రైల్వేకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు
◆ రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట
◆ మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం నిధులు. మూల ధనం కింద రూ.10 లక్షల కోట్లు
◆ పేద ఖైదీలకు బెయిల్ పొందేందుకు ఆర్థిక సాయం
◆ డిజిటల్ సిస్టమ్స్ కోసం గుర్తింపు ఆధారంగా ఇక PAN . ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్
◆ గతంలో కట్టిన బిడ్స్ మొత్తం ఎంఎస్‌ఎంఈలకు తిరిగి చెల్లిస్తాం.
◆ ఎంఎస్‌ఎంఈ, పెద్ద సంస్థలు, స్వచ్ఛంద సంస్థల కోసం డిజిలాకర్ వ్యవస్థ
◆ 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటు
◆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
◆ మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం
◆ స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహం. స్టార్టప్‌లకు రిస్క్ తగ్గించేందుకు కృషి
◆ KYC ప్రక్రియ సులభతరం చేయాలని నిర్ణయం
◆ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకకు ప్రత్యేక నిధుల కేటాయింపు.
◆ కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, సాగు రంగానికి రూ.5300 కోట్లు
◆ నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్‌కు రూ.19,700 కోట్ల కేటాయింపు
◆ విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్ల కేటాయింపు
◆ నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్ పథకం నాలుగో దశ ప్రారంభం
◆ పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి శిక్షణ. మూడేళ్ల పాటు 47 లక్షల మంది యూత్‌కు స్టైఫండ్
◆ పర్యాటకరంగ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు. ఛాలెంజ్ విధానంలో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల ఎంపిక.. 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
◆ దేఖో ఆప్నా దేఖ్ పథకం ప్రారంభం
◆ స్వదేశ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
◆ మహిళల కోసం అధిక వడ్డీతో ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం ప్రారంభం.
◆ రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు. మూల ధన వ్యయం పెంచేందుకు రాష్ట్రాలకు చేయూత
◆ రోడ్లు, రహదారుల నిర్మాణానికి రూ.75వేల కోట్ల కేటాయింపు
◆ పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 23 శాతం నుంచి 13 శాతానికి తగ్గించాం. ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ డ్యూటీ, టీవీ ప్యానెళ్ల ధరలు తగ్గించాం. కిచెన్ చిమ్నీలు, వజ్రాల ధరలు తగ్గుతాయి.
◆ విదేశాల నుంచి దిగుమతి సుంకం పెరగడంతో టైర్లు, రబ్బర్, సిగరెట్లు, బ్రాండెడ్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. బంగారం, వెండి ధరలు పెరుగుతాయి.