UGC NET 2023 DECEMBER : నోటిఫికేషన్ విడుదల

న్యూడిల్లీ (అక్టోబర్ – 01) : UGC NET 2023 DECEMBER NOTIFICATION – యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 డిసెంబర్ మాసానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత పరీక్షగా ఈ పరీక్ష ఉపయోగపడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (nta) ఈ పరీక్షను నిర్వహించనుంది.

మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే యుజిసి నెట్ 2023 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు అక్టోబర్ 28 వరకు కలదు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా డిసెంబర్ 6 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు.

ముఖ్య సమాచారం

అర్హతలు : 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన
పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. JRF కు 01.12.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

సబ్జెక్టులు : అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హోం సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్ సైన్స్, ఇండియన్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా, మొదలైన సబ్జెక్టులు..

పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు
ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు, 100 మార్కులు… పేపర్-2లో 100 ప్రశ్నలు, 200 మార్కులు కేటాయించారు.

దరఖాస్తు ఫీజు : 1150/- (EWS & OBC – 600/-, SC, ST, PH, 3rd GENDER – 325/-

దరఖాస్తు గడువు : అక్టోబర్ – 28 – 2023

దరఖాస్తు ఫీజు గడువు : అక్టోబర్ – 29 – 2023

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : అక్టోబర్ – 30, 31 – 2023

పరీక్ష తేదీలు : డిసెంబర్ 06 నుంచి 22 – 2023 వరకు

ఫలితాలు విడుదల : జనవరి – 10 – 2024

వెబ్సైట్ : https://ugcnet.nta.nic.in/

దరఖాస్తు లింక్ : APPLY HERE