UGC CU CHAYAN : ఉద్యోగాల భర్తీకి వెబ్ పోర్టల్

హైదరాబాద్ (మే – 03) : యూజీసీ – ‘సీయూ-చయన్’ (UGC – CU – CHAYAN) పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ఏకీకృత వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిట్లు ఛైర్మన్ ఎం. జగదీష్ కుమార్ తెలిపారు.

కేంద్ర విశ్వవిద్యాలయాలు, దరఖాస్తుదారులకు ఈ వెబ్ పోర్టల్ ఉపయోగకరమైన రీతిలో ఉంటుందన్నారు. ఇప్పటివరకు నియామక ప్రక్రియను యూనివర్శిటీలు వాటి వాటి వెబ్ పోర్టల్స్ ద్వారా నిర్వహించుకుంటున్నాయి. ఇకమీదట ఈ ఏకీకృత పోర్టల్ ను ఉపయోగించుకొని విడివిడిగానే అవి నియామకాలు చేపట్టుకోవచ్చని ఆయన వివరించారు.

దరఖాస్తుదారు ఒకసారి లాగిన్ అయితే చాలు అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల ఫ్యాకల్టీ పోస్టుల ఖాళీల వివరాల సమాచారం ‘సీయూ-చయన్’ ద్వారా ఎప్పటికప్పుడు అందుతుంది. ఈ పోర్టల్ ద్వారానే దరఖాస్తు పంపుకోవచ్చు. ఏదైనా విశ్వవిద్యాలయం ఇప్పటికే అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించి ఉంటే… అది యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.

◆ వెబ్సైట్ : https://curec.samarth.ac.in/index.php/search/site/index