కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ జీవోలు విడుదల

హైదరాబాద్ (మే – 02) : తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తూ క్రమబద్ధీకరణ అయిన కాంట్రాక్టు లెక్చరర్ల పేర్లతో కూడిన జీవోలను ఉన్నత విద్యాశాఖ ఈరోజు విడుదల చేయడం జరిగింది.

2,909 మంది జూనియర్ లెక్చరర్ లను, 280 మంది డిగ్రీ లెక్చరర్ లను, 390 పాలిటెక్నిక్ లెక్చరర్ లను, 131 లాబ్ అటెండర్ లను క్రమబద్ధీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.