WHO T.B. REPORT : విజృంభిస్తున్న క్షయ

BIKKI NEWS : world health organization – Global Tuberculosis – 2023 report – ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ట్యుబర్‌క్యులోసిస్ (క్షయ వ్యాధి) నివేదిక – 2023 ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2022 లో 75 లక్షల మంది క్షయ వ్యాధి బారిన నూతనంగా పడినట్లు వెల్లడించింది.

1995 సంవత్సరం నుంచి ఈ నివేదిక లు ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేస్తుంది. అయితే 2022 లో నమోదైన కేసులే ఇప్పటివరకు అత్యధికం కావడం జాగ్రత్త పడాల్సిన అవసరం.

ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2021లో 1.3 కోట్ల మంది, 2022లో 1.6 కోట్లు, టీబీతో బాధపడుతున్నట్లు అంచనా.

2020, 2021లో భారత్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ లలో 60శాతానికి పైగా కొత్త కేసులు తగ్గాయి. 2019తో పోల్చితో 2022లో ఎక్కువ బాధితులు కోలుకున్నట్లు నివేదిక పేర్కొంది.

గతేడాది ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మందిలో టీబీ (ట్యూబర్క్యులోసిస్) వ్యాధిని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఎ) నివేదిక
వెల్లడించింది.

డబ్ల్యూహెచ్ 1995 నుంచి టీబీ వ్యాధిగ్రస్థుల గణాంకాలు నమోదు చేస్తుండగా.. 2022లోనే రికార్డు స్థాయి కేసులు బయటపడినట్లు వెల్లడించింది.

192 దేశాలు, ఆయా ప్రాంతాల్లో సేకరించిన నమూనాలు
పరీక్షించిన అనంతరం వెల్లడైన వివరాల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు.