TSPSC – 833 ఇంజనీరింగ్ ఉద్యోగాల పరీక్ష వాయిదా

హైదరాబాద్ (అక్టోబర్ 16) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఇంజనీరింగ్ శాఖలలో అసిస్టెంట్ ఇంజనీర్ (AE), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (MAE), టెక్నికల్ ఆఫీసర్ (TO), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (JTO) రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అక్టోబర్ 17 నుండి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. హాల్ టికెట్ల డౌన్లోడ్ కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 833 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ లో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ (EEE) పరీక్ష ను అక్టోబర్ 20న రెండు సెషన్ లలో CBRT పద్దతిలో నిర్వహించనున్నారు.

EEE పరీక్షలకు సంబంధించిన హల్ టికెట్స్ అక్టోబర్ 17 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజనీరింగ్ పరీక్షలు అక్టోబర్ – 18 , 19, తేదీలలో రెండు సెషన్స్ చొప్పున జరగనున్నాయి. వీటి హల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.

అయితే అక్టోబర్ 20 న నిర్వహించాల్సిన మెకానికల్ ఇంజనీరింగ్ పరీక్షలను అక్టోబర్ 26న రెండు సెషన్స్ లలో CBRT పద్దతిలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. లాజిస్టిక్స్ సమస్య కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇంతకుముందే ఈ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినప్పటికీ పేపర్ లీక్ అంశం (TSPSC PAPER LEAK) కారణంగా రద్దు చేసి మరల ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది.

TSPSC AE, JTO EXAM HALL TICKETS