చరిత్రలో ఈరోజు అక్టోబర్ 17

★ దినోత్సవం

  • అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం

★ సంఘటనలు

1933: నాజీ ల దురాగతాలు భరించలేక మాతృభూమి (జర్మనీ) ని వదిలి ఐన్‌స్టీన్‌ అమెరికాకు పయనం.
1949: జమ్ము, కాశ్మీర్‌ లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 వ నిబంధనను చట్టసభలు స్వీకరించాయి.
1979: మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
2003: ‘జితి జితాయి పాలిటిక్స్‌’… మధ్యప్రదేశ్‌లో హిజ్రా ల తొలి రాజకీయపార్టీ స్థాపన.

★ జననాలు

1872: చిలుకూరి వీరభద్రరావు, పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చేసిన ఇతిహాసకుడు.
1901: జి.ఎస్.మేల్కోటే, సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, పరిపాలనా దక్షుడు. (మ.1982)
1920: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948)
1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త. (మ.2011)
1948: అన్నపూర్ణ (నటి), ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి.
1955: స్మితా పాటిల్, హిందీ సినీనటి. (మ.1986)
1965: మాల్గాడీ శుభ , తెలుగు పాప్ సింగర్.
1970: అనిల్ కుంబ్లే, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1980: చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (మ. 2020)
1992: కీర్తీ సురేష్, మలయాళం, తమిళ, తెలుగు సినిమా నటి.
1992; ప్రణీత సుభాష్, కన్నడ,తెలుగు,తమిళ, చిత్ర నటి.

★ మరణాలు

1937: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (జ.1877)
2014: ఎనుముల సావిత్రీదేవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు.