GROUP 1 ప్రిలిమ్స్ రద్దు : డివిజన్ బేంచ్ కి TSPSC

హైదరాబాద్ (సెప్టెంబర్ – 24) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూపు – 1 రద్దు చేయాలంటూ (HIGH COURT CANCELLED GROUP 1 PRELIMS EXAM) హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమై తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థుల నుండి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సెప్టెంబర్ 23న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

మొదటిసారి గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించినప్పుడు పేపర్ లీక్ (TSPSC PAPER LEAK) అంశం కారణంగా టిఎస్పిఎస్సి పరీక్ష రద్దు చేయగా… రెండోసారి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని కారణంగా హైకోర్టు ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమైన టిఎస్పిఎస్సి బోర్డు తీర్పు పై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వంటి సంస్థలు నిర్వహించే పరీక్షల్లో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం లేదని దానివల్ల అభ్యర్థులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు పరీక్ష రద్దు అవుతుందా లేదా న్యాయవివాదాలతో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఎప్పుడూ అనేది సందిగ్ధంలో పడుతుందా అని గందరగోళంలో పడ్డారు.