TSPSC – 833 AE, JTO ఉద్యోగాల పరీక్ష హల్ టికెట్లు విడుదల

హైదరాబాద్ (అక్టోబర్ 12) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో అసిస్టెంట్ ఇంజనీర్ (AE), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (MAE), టెక్నికల్ ఆఫీసర్ (TO), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (JTO):రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అక్టోబర్ 14 లేదా 15వ తేదీలలో వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. హాల్ టికెట్ల డౌన్లోడ్ కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి

ఈ నోటిఫికేషన్ ద్వారా 833 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్ – 18 , 19, 20వ తేదీలలో రెండు సెషన్స్ చొప్పున జరగనున్నాయి.

ఇంతకుముందే ఈ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినప్పటికీ పేపర్ లీక్ అంశం (TSPSC PAPER LEAK) కారణంగా రద్దు చేసి మరల ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది.

TSPSC AE, JTO EXAM HALL TICKETS