TELANGANA DATA 2014 vs 2022

BIKKI NEWS : 2023 – 24 ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను, చేపడుతున్న చర్యలను అసెంబ్లీలో తన ప్రసంగంలో (TELANGANA DATA 2014 vs 2022) వివరించారు… పోటీ పరీక్షలు నేపథ్యంలో ఆ డేటాను క్లుప్తంగా మీకోసం అందించడం జరిగింది.

TELANGANA DATA 2014 vs 2022

◆ తెలంగాణ రాష్ట్ర ఆదాయం 2014 – 15 ఆర్థిక సంవత్సరంలో 62 వేల కోట్లు ఉండగా 2021 నాటికి 1.84 లక్షల కోట్లకు చేరింది.

◆ తెలంగాణ తలసరి ఆదాయం 2014 – 15 ఆర్థిక సంవత్సరంలో 1,24,104 రూపాయలు ఉంటే 2022 – 23 కు రూపాయలు 3,17,115 కు చేరింది.

◆ సాగునీటి సౌకర్యం 2014 – 15 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల ఎకరాలుగా ఉంటే ప్రస్తుతం 73.33 లక్షల ఎకరాలకు చేరింది.

◆ రైతు బంధు పథకం ద్వారా 65 లక్షల రైతులకు 65 వేల కోట్ల సాయం ఇప్పటివరకు అందించడం జరిగింది.

◆ రైతు భీమా ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు 5 లక్షలు అందిస్తున్నారు.

◆ ధాన్యం ఉత్పత్తి 2014 – 15 ఆర్థిక సంవత్సరంలో 68.17 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా ప్రస్తుతం
2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.

◆ రాష్ట్ర జీఎస్‌డీపీలో 18.2% వ్యవసాయం నుండే అందుతుడడం విశేషం

◆ 2014 – 15 ఆర్థిక సంవత్సరంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగా వాట్లు కాగా ప్రస్తుతం 18,453 మెగా వాట్లకు చేరింది.

◆ 2014 – 15 ఆర్థిక సంవత్సరంలో తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్స్ కాగా 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి 2126 యూనిట్స్ కు చేరడం విశేషం.

◆ దళిత బంధు పథకం ద్వారా దళితులకు మళ్లీ చెల్లింపు చేయాల్సిన అవసరం లేకుండా 10 లక్షల రూపాయలను అందజేయడం జరుగుతుంది.

◆ ఆసరా పించన్లు వయోపరిమితి 57 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది.

◆ గిరిజన రిజర్వేషన్లను 6 % నుంచి 10% పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

◆ 2471 గిరిజన తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులను ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించారు.

◆ గొల్లకుర్మల సంక్షేమ కోసం 11 వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్ ల గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తద్వారామాంసోత్పత్తిలో దేశం లోనే తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది.

◆ చేనేత మిత్ర ద్వారా 50% సబ్సిడీతో నేతన్నల సామాగ్రి కొనుగోలుకు సహాయం అందజేయడం జరుగుతుంది.

◆ ప్రమాదవశాత్తు మరణించిన నేతన్నలకు ‘నేతన్న భీమా’పేరుతో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.

◆ గౌడ కులస్థుల అబివృద్ది కోసం 15% వైన్ షాపుల రిజర్వేషన్ కు వారి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది.గీత కార్మికులకు కూడా భీమా 5 లక్షల కల్పించడం జరిగింది. నీరా ను సాప్ట్ డ్రింక్ గా గుర్తించడం జరిగింది.

◆ లాండ్రీ, సెలూన్ లకు 250 యూనిట్ ల వరకు ఉచితవిద్యుత్ అందజేయడం ద్వారా రజక, నాయీ బ్రహ్మణులకు ఆర్థిక చేయూత అందించడం జరిగుతుంది.

◆ తెలంగాణ ఎర్పడే నాటికి 19 గా బీసీ రెసిడెన్షియల్ గురుకులాలను 310 కి పెంచడం జరిగింది. 203 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయడం జరుగింది. మొత్తంగా 1000 కి పైగా గు‌రుకులాల ఏర్పాటు.

◆ ఆరోగ్య లక్ష్మీ కార్యక్రమం కింద అంగన్వాడీ ద్వారా పాలు, గుడ్లు గర్బీణి మహిళలకు, చిన్నారులకు సరఫరా చేయడం జరుగుతుంది.

◆ మహిళలకు సివిల్ పోలీసు నియామకాలలో 33% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.

◆ కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ పథకాల ద్వారా 1,00,116/- రూపాయలను ఇప్పటివరకు 12,0,469 మందికి అందజేయడం జరిగింది.

◆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో 2,21,774 ఉద్యోగాల కల్పించడం జరిగింది.

◆ మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి పథకానికి 7289 కోట్లు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,065 పాఠశాలలో12 రకాల మౌళిక వసతులను కల్పించడం జరుగుతుంది.

◆ తెలంగాణ రాష్ట్రం వైద్య సేవలలో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. కేసీఆర్ కిట్స్, న్యూట్రీషన్లు కిట్స్ ఆరోగ్య లక్ష్మీ ద్వారా వైద్య సేవలను మరింత చేరువ చేయడం జరిగింది

◆ 20 జిల్లాలో డయోగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగింది మరియు 104 డయాలసిస్ సెంటర్లను కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది.

◆ వరంగల్ లో 1,100 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హస్పిటల్ ను మరియు హైదరాబాద్ నాలుగు దిక్కులలో నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ TIMS లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

◆ తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 3 వైద్య కళాశాలలు ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 17 వైద్య కళాశాలు ప్రారంభమయ్యాయి. మరో 9 కళాశాల అనుమతి ఇవ్వడం జరిగింది. 342 బస్తి దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగింది.

◆ 2014 – 15 లో ప్రభుత్వ హస్పిటల్ లో ప్రసవాల రేటు 30% కాగా ప్రస్తుతం 61% ప్రసవాలు ప్రభుత్వ హాస్పిటల్స్ లలో జరగటం విశేషం

◆ 2014 – 15 లో మాతృ మరణాల రేటు లక్షకు 92 కాగా ప్రస్తుతం లక్షకు 43 కు తగ్గిండం జరిగింది. అలాగే శిశు మరణాల రేటు 39 నుంచి 21 కు తగ్గింది.

◆ హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనం 7.7% పెరిగిందని ఫారెస్ట్ సర్వే అఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. ‘ట్రీ సీటీ హైదరాబాద్’ గా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది

◆ 3.31 లక్షల కోట్ల ఐటీ పెట్టుబడులు సాదించడం ద్వారా మరియు 140% ఐటీ ఉద్యోగ కల్పన వృద్ధి జరిగింది.

◆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో నూతన సచివాలయం నిర్మించడంతోపాటు,125 అడుగు అంబేద్కర్ విగ్రహన్ని మరియు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.

◆ పౌరుల రక్షణ కోసం 9.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాదులో ప్రపంచ సాంకేతికతతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది.