హైదరాబాద్ (డిసెంబర్ – 31) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కళాశాల విద్యా శాఖలో 491 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు 17 సబ్జెక్టులలో భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు TSPSC అధికారులు తెలిపారు. మే లేదా జూన్లో నియామక పరీక్ష ఉంటుందని తెలిపారు.
◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/