CONSTABLE RESULT : 16,604 కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాలు విడుదల

హైదరాబాద్ (ఆక్టోబర్ – 04) : తెలంగాణ రాష్ట్ర లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 16,604 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాలను (tslprb police constable final results link) విడుదల చేసింది ఫలితాలు రేపు ఉదయం నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

13 రకాల పోస్టులలో ఈ నియామకాలు చేపట్టగా అర్హులైన అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేయనున్నారు. వీరికి త్వరలోనే శిక్షణా కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు 12,866 మంది, మహిళ అభ్యర్థులు 2,884 మంది ఎంపికైనట్లు తెలిపింది.

ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 12, 13 వ తేదీలలో నిర్దేశించబడిన కేంద్రాలలో అటేస్టేషన్ ఫామ్ ను అందజేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ లో ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది

వెబ్సైట్ : https://www.tslprb.in/