GURUKULA MERIT LIST – 1:2 నిష్పత్తిలో మెరిట్ లిస్ట్ విడుదలకు కసరత్తు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 23) : తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూటషనల్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI RB) వివిధ గురుకుల సొసైటీలో ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో విడుదల కోసం తీవ్ర కసరత్తు చేస్తుంది. మొట్టమొదటిగా డిగ్రీ లెక్చరర్లకు సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది.

టీఎస్పీఎస్సీ జేఎల్ పరీక్షలు ముగిశాక డీఎల్ మెరిట్ జాబితా
విడుదల చేసి, 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను డెమోకు పిలువాలని ట్రిబ్ సన్నాహాలు చేస్తున్నది.

గురుకులాల్లో మొత్తం తొమ్మిది క్యాటగిరీల్లో పీజీటీ 1,276, టీజీటీ 4,020, జేఎల్, డీఎల్, ఫిజికల్ డైరెక్టర్ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించారు.

ఎక్కువ కేటగిరి పోస్టుల నుండి తక్కువ కేటగిరి పోస్టులకు అనగా డిగ్రీ లెక్చరర్, తరువాత జేఎల్, ఆపై పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయాలని సన్నాహాలు చేస్తున్నది. తద్వారా భవిష్యత్ లో ఖాళీలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది

ప్రభుత్వ గురుకులాలకు సంబంధించి జోనల్ స్థాయి పోస్టులైన టీజీటీ, స్కూల్ పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్
పోస్టుల రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియను ట్రిబ్ ప్రారంభించింది. ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల మెరిట్ జాబితాలను కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది.

టీజీటీ అభ్యర్థులుఈ నెల 30 లోపు, స్కూల్ లైబ్రేరియన్, పీడీ, డ్రాయింగ్ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల అభ్యర్థులు అక్టోబర్ 3 నుంచి 9లోపు జోనల్ వారీగా, గురుకుల సొసైటీల వారీగా ఆప్షన్లు ఇవ్వాలని అధికారులు సూచించారు.